-

Madhabi Puri Buch: ఇక అదే రోజు సెటిల్‌మెంట్‌

28 Nov, 2023 01:00 IST|Sakshi

స్టాక్‌ లావాదేవీల్లో వేగానికి శ్రీకారం

మార్చికల్లా అమలు: సెబీ చీఫ్‌ మాధవి

ముంబై: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రానున్న(2024) మార్చికల్లా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో నిర్వహించే లావాదేవీల సెటిల్‌మెంట్‌ను అదే రోజు పూర్తిచేసేందుకు వీలు కలి్పంచనుంది. ఇప్పటికే లావాదేవీ చేపట్టిన ఒక్క రోజులోనే(టీప్లస్‌ 1) సెటిల్‌మెంట్‌ పూర్తవుతోంది. అయితే మార్చికల్లా లావాదేవీ నిర్వహించిన రోజే(టీప్లస్‌0) సెటిల్‌మెంట్‌కు తెరతీసే లక్ష్యంతో ఉన్నట్లు సెబీ చైర్‌పర్శన్‌ మాధవీ పురి బచ్‌ పేర్కొన్నారు.

ఆపై మరో 12 నెలల్లోగా లావాదేవీ నమోదైన వెంటనే అప్పటికప్పుడు(ఇన్‌స్టెంట్‌) సెటిల్‌మెంట్‌కు వీలు కలి్పంచాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి రియల్‌టైమ్‌ ప్రాతిపదికన లావాదేవీల పూర్తిని చేపట్టాలని ఆశిస్తున్నట్లు సెబీ బోర్డు సమావేశం తదుపరి విలేకరుల సమావేశంలో మాధవి వెల్లడించారు. స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీల ఇన్‌స్టెంట్‌ సెటిల్‌మెంట్‌ ఆలోచనపై మార్కెట్‌ మేకర్స్‌ నుంచి ఈ సందర్భంగా సలహాలు, సూచనలను ఆహా్వనిస్తున్నట్లు తెలియజేశారు. కొత్త సెటిల్‌మెంట్‌ను ప్రస్తుత సెటిల్‌మెంట్‌కు సమాంతరంగా అమలు చేయనున్నట్లు  పేర్కొన్నారు.

కొత్త సెటిల్‌మెంట్‌ను ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చని మాధవి తెలిపారు. అయితే కొన్ని ఎంపిక చేసిన భారీ ప్రొడక్టులకు మాత్రమే అది కూడా ఆప్షనల్‌గా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీల సెటిల్‌మెంట్‌ గడువును టీప్లస్‌ 2 నుంచి టీప్లస్‌ 1కు తగ్గించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు