-
వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..!
సమ్మర్ వచ్చిందంటే..వెడ్డింగ్ సీజన్ వచ్చేసినట్టే.. ఒక్కోసారి అనుకోకుండా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తుంది. తీరిగ్గా తయారయ్యేంత సమయం ఉండకపోచ్చు. అందంగా, సూపర్ స్టైలిష్ లుక్‌తో అందరిలో స్పెషల్‌గా కనిపించాలి అందరీకి ఉంటుంది. అందులోనూ చాలా మంది ఆఫీసులో పని తర్వాత పెళ్లికో, రిసెప్షన్కో హాజరు కావాల్సిన పని ఉంటుంది. పని ఒత్తిడి ఖచ్చితంగా ముఖం మీద కనిపిస్తుంది. మరి అలాంటి ఇన్స్టెంట్గా ఫేస్‌లో గ్లో కావాలంటే ఏం చేయాలి. చిన్న టిప్స్ ద్వారా చర్మానికి తక్షణ నిగారింపు తీసుకురావచ్చు. అవేమిటో చూద్దాం.. క్లెన్సింగ్: ముందుగా కొద్దిగా రోజ్ వాటర్ ని తీసుకుని.. దానిని ముఖం అంతా అప్లై చేసుకోవాలి. ఇది స్కిన్ కి టోనర్ గా పని చేస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు బిగుస్తాయి. చర్మానికి మేలు చేస్తుంది. స్క్రబ్బింగ్: ఆ తర్వాత ఫేస్ కి స్క్రబ్బింగ్ చేయాలి. ఇందుకోసం టమాటాను తీసుకుని దాన్ని మధ్యలోకి కట్ చేయాలి. ఇలా తీసుకున్న టమాటా మీద కాస్త పంచదార అద్ది దానితో ముఖంపై రుద్దాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే నల్లమచ్చలు, ట్యాన్ తొలగి చర్మం మిలమిలలాడుతుంది. మసాజ్: కలబంద గుజ్జు... అదేనండీ... కాస్తంత అలోవెరా జెల్‌ను తీసుకుని దీనితో చర్మంపై మృదువుగా మసాజ్ చేయాలి. ఆలోవెరాలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉండటం వల్ల అది మీ చర్మాన్ని కాంతిమంతంగా, మృదువుగా ఉండేలా చేస్తుంది. బొప్పాయి: ఇంట్లో బొప్పాయి పండు ఉందా? కేవలం 10 నిమిషాల్లో ముఖానికి అందమైన మెరుపు కావాలంటే బొప్పాయిని మించింది లేదు.బొప్పాయిలో విటమిన్ ఏ, సీ,మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చిన్న బొప్పాయిని ముక్క తీసుకొని ముఖమంతా 10 నిమిషాలు మసాజ్ చేస్తే, చక్కటి గ్లో వస్తుంది. పాలు: పాలలో విటమిన్ ఏ, సీ, బి6, బి12, కాల్షియం, పొటాషియం , చర్మానికి మేలు చేస్తాయి. పచ్చి పాలలో కాటన్ ప్యాడ్‌ని ముంచి ముఖం, మెడ అంతటా అప్లై చేయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి కడగాలి. కాంతి వంతంగా, ఫ్రెష్‌లుక్ మీ సొంతం. -
Madhabi Puri Buch: ఇక అదే రోజు సెటిల్మెంట్
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రానున్న(2024) మార్చికల్లా స్టాక్ ఎక్సే్ఛంజీలలో నిర్వహించే లావాదేవీల సెటిల్మెంట్ను అదే రోజు పూర్తిచేసేందుకు వీలు కలి్పంచనుంది. ఇప్పటికే లావాదేవీ చేపట్టిన ఒక్క రోజులోనే(టీప్లస్ 1) సెటిల్మెంట్ పూర్తవుతోంది. అయితే మార్చికల్లా లావాదేవీ నిర్వహించిన రోజే(టీప్లస్0) సెటిల్మెంట్కు తెరతీసే లక్ష్యంతో ఉన్నట్లు సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బచ్ పేర్కొన్నారు. ఆపై మరో 12 నెలల్లోగా లావాదేవీ నమోదైన వెంటనే అప్పటికప్పుడు(ఇన్స్టెంట్) సెటిల్మెంట్కు వీలు కలి్పంచాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి రియల్‌టైమ్ ప్రాతిపదికన లావాదేవీల పూర్తిని చేపట్టాలని ఆశిస్తున్నట్లు సెబీ బోర్డు సమావేశం తదుపరి విలేకరుల సమావేశంలో మాధవి వెల్లడించారు. స్టాక్ మార్కెట్ లావాదేవీల ఇన్స్టెంట్ సెటిల్మెంట్ ఆలోచనపై మార్కెట్ మేకర్స్ నుంచి ఈ సందర్భంగా సలహాలు, సూచనలను ఆహా్వనిస్తున్నట్లు తెలియజేశారు. కొత్త సెటిల్మెంట్ను ప్రస్తుత సెటిల్మెంట్కు సమాంతరంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చని మాధవి తెలిపారు. అయితే కొన్ని ఎంపిక చేసిన భారీ ప్రొడక్టులకు మాత్రమే అది కూడా ఆప్షనల్‌గా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ గడువును టీప్లస్ 2 నుంచి టీప్లస్ 1కు తగ్గించిన సంగతి తెలిసిందే. -
ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే
ఎక్కువ మంది బీర్లు తాగేందుకు ప్రిఫర్ చేస్తారు. అది మంచిదని కొందరూ..గ్లామర్ కోసం అని మరికొందరూ తాగుతుంటారు. పైగా ఆ బీర్లో క్రిస్పీగా సైడ్ డిష్‌లు ఉండాల్సిందే. ఇక చూడు సామిరంగా మందుబాబులు ఓ రేంజ్లో కుమ్మేస్తారు. ఇక ఓ కంపెనీ మరింత ముందడుగు వేసి ఏకంగా ఇన్స్టెంట్ బీర్ పౌడర్లను తీసుకొచ్చింది. ఇక మందు బాబులు బయటకు అడుగుపెట్టకుండా ఇంట్లోనే గ్లాస్లో దర్జాగా ఐస్‌క్యూబ్‌లు వేసుకుని బీర్ తాగేయొచ్చు అంటోంది జర్మన్ కంపెనీ. ఈ మేరకు జర్మనీకి చెందిన బ్రూవరీ కంపెనీ ఇంట్లోనే క్షణాల్లో బీర్ తయారు చేసుకునేలా ఇన్‌స్టింట్ కాఫీ మాదిరిగా బీర్ పౌడర్ని తీసుకొచ్చింది. ఇక ఇంట్లోనే చల్లగా తయారు చేసుకుని క్రిస్పీ స్నాక్స్‌తో ఓ పట్టుపట్టేయొచ్చు. ఇన్స్టెంట్ కాఫీ లేదా మిల్క్‌షేక్ మాదిరిగా క్షణాల్లో తయారు చేసుకోవచ్చట. ఒక గ్లాస్లో రెండు చెంచాల బీర్ పొడికి నీటిని జోడిస్తే చాలట. నిమిషాల్లో రెడీ అయిపోతుందట. దీంతో ఇక టన్నుల కొద్ది బీర్ రవాణను భారీగా తగ్గుతుందని అంటున్నారు వ్యాపార నిపుణులు. ఇక నుంచి ఒక కిలో బీర్ రవాణకు బదులు కేవలం 45 గ్రాముల పౌడర్‌కి పరిమితం చేయొచ్చు. అదే సమయంలో బీర్‌తో స్నానం చేయాలనుకునే వారి కోసం బాత్ బీర్‌ను కూడా రూపొందిస్తున్నారట. ప్రస్తుతానికి సదరు జర్మనీ కంపెనీ 42 రకాల బీర్లను అందిస్తోందని, అలాగే గ్లూటెన్-ఫ్రీ బీర్, నాన్ ఆల్కహాలిక్ బీర్లను సైతం తయారు చేయునున్నట్లు సదరు జర్మనీ కంపెనీ బ్రూవరీ న్యూజెల్లర్ క్లోస్టర్ బ్రూ పేర్కొంది. -
విస్తరణ బాటలో డన్జో4బిజినెస్
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ డెలివరీ సేవల సంస్థ డన్జోలో లాజిస్టిక్స్ విభాగమైన డన్జో4బిజినెస్ (డీ4బీ) తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే 12–18 నెలల్లో 10–15 నగరాల్లో ప్రవేశించనున్నట్లు డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి తెలిపారు. ప్రస్తుతం తాము 10 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డన్జో ద్వారా నిత్యావసరాల డెలివరీలకు వచ్చే ఆర్డర్లతో పాటు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్‌ఫాంపై వచ్చే ఆర్డర్లను కూడా అందిస్తున్నట్లు సూరి చెప్పారు. చివరి అంచె వరకు ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఓఎన్డీసీ యూజర్లకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నుంచి అత్యధికంగా ఆర్డర్లు వస్తున్నాయని సూరి చెప్పారు. 70,000 మంది డెలివరీ పార్ట్నర్లతో కలిసి డీ4బీ పనిచేస్తోంది. యూజర్లు ఎక్కువగా నిత్యావసరాలు, ఆహార ఉత్పత్తులు, ఔషధాలకు ఆర్డరు ఇస్తున్నారని సూరి చెప్పారు. సగటున ఆర్డరు పరిమాణం రూ. 200–4,000 వరకు ఉంటోందని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై రవాణా చేయగలిగే అన్ని రకాల ఉత్పత్తులను డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. -
ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్‌పై నుంచి జారి..
జంతువుల పట్ల కొందరు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. అవి ఎలాంటి హానీ చేయకపోయినా సరే శిక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మనసును కలచివేసేలా ఉంటున్నాయి. అయితే ఇలాగే ఓ మూగజీవాన్ని శిక్షించబోయిన ఆకతాయికి ఊహించని షాక్ తలిగింది. స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న అతడు.. రోడ్డుపై ఉన్న ఓ గేదెను తన్నాడు. ఆ వెంటనే బైక్‌పై నుంచి జారి కిందపడ్డాడు. బైక్‌ను రైడ్ చేస్తున్న అతని స్నేహితుడు కూడా అదుపుతప్పి పోల్‌ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు గాయాలపాలయ్యారు. Instant karma 😂 pic.twitter.com/jNFMfEf9Fm — CCTV IDIOTS (@cctvidiots) April 30, 2023 అయితే గతంలో ఎప్పుడో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకతాయిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. గేదె ఏం చేసిందని తన్నావు.. చూడు ఇప్పుడు నీకు ఏం జరిగిందో.. అందుకే మూగజీవాలకు హాని చేయెద్దు అని హితవు పలికారు. మరో నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ.. ఇన్స్టాంట్ ఖర్మ అంటే భయ్యా.. తప్పు చేసిన వెంటనే శిక్ష పడుతుంది. క్షణం కూడా ఆలస్యం కాదు.. అంటూ యువకుడ్ని చీవాట్లు పెట్టాడు. చదవండి: బ్యానెట్‌పై మనిషిని ఈడ్చుకెళ్లి..ఎంపీ డ్రైవర్ దారుణం!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement