ఉద్యోగ నియామకాలు పెరిగాయ్, ఏ రంగంలో ఎంత పెరిగాయంటే!

9 Jul, 2022 10:10 IST|Sakshi

ముంబై: దేశీయంగా జూన్‌లో నియామకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 3 శాతం  పెరిగాయి. మాన్‌స్టర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఇండెక్స్‌ ప్రకారం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), యాత్రలు, పర్యాటకం, రసాయన పరిశ్రమల్లో నియామకాల అధికమయ్యాయి.

సుస్థిర ఆర్థిక రంగం, పర్యావరణ అనుకూల విభాగాలు, ఆతిథ్యంలోనూ ఈ జోరు సాగింది. మాన్‌స్టర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఇండెక్స్‌ 271 నుంచి గత నెలలో 279కి ఎగసింది. 
 
మే నెలలో ఇండెక్స్‌ 284 పాయింట్లు నమోదు చేసింది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ 26 శాతం, ఇంజనీరింగ్, సిమెంట్, నిర్మాణం, ఐరన్‌/స్టీల్‌ రంగాలు 20 శాతం తిరోగమనం చెందాయి. 
 

>
మరిన్ని వార్తలు