భారత్‌లో మరిన్ని పెట్టుబడులు

24 Sep, 2022 06:25 IST|Sakshi

పునరుత్పాదక విద్యుత్‌పై మరింతగా దృష్టి

సెంబ్‌కార్ప్‌ దక్షిణాసియా సీఈవో విపుల్‌ తులి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో పునరుత్పాదక విద్యుత్‌ విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సెంబ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ సీఈవో (దక్షిణాసి యా) విపుల్‌ తులి తెలిపారు. దేశీయంగా మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. భారత్‌లో కేవలం తమ థర్మల్‌ పోర్ట్‌ఫోలియోనే విక్రయిస్తున్నామని, దేశం నుంచి నిష్క్రమించే యోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్‌ చేయబోమంటూ 2020లో చేసిన ప్రకటనకు అనుగుణంగానే థర్మల్‌ పోర్ట్‌ఫోలియో నుంచి తప్పుకుంటున్నామని పేర్కొన్నారు. ఒమన్‌కి చెందిన తన్వీర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ ఇండియా (ఎస్‌ఈఐఎల్‌)లో పూర్తి వాటాలు విక్ర యించడం వల్ల సంస్థ ఉద్యోగులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆయ న స్పష్టం చేశారు.

కొత్త యా జమాన్యం కింద వారు యథాప్రకారం కొనసాగుతా రని తులి వివరించారు. ఈ లావాదేవీ పూర్తయ్యాక తమ సంస్థ పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామ ర్థ్యం 1730 మెగావాట్లుగా ఉంటుందని, 700 మెగావాట్ల ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నాయని ఆయ న పేర్కొన్నారు. ఈ డీల్‌తో వచ్చే నిధుల్లో కొంత భాగాన్ని పునరుత్పాదక విద్యుత్‌ పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసుకోవడం కోసం వినియోగించనున్న ట్లు వివరించారు. అగ్రగామి పవన విద్యుత్‌ సంస్థ ల్లో ఒకటిగా ఉన్న తమ కంపెనీ, సౌర విద్యుత్‌ విభాగంలోనూ శక్తివంతమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించు కునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తులి చెప్పారు. అలాగే విద్యుత్‌ స్టోరేజీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ వంటి విభాగాల్లో నూ అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు