todayStockMarketUpdate: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌

11 Jan, 2023 15:40 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాల్లో ముగిసాయి.  ఎప్‌ఐఐల అమ్మకాలు, ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో బలహీనమైన ధోరణి మధ్య బుధవారం ప్రారంభ ట్రేడ్‌లో ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు   ప్రతికూలంగా ఆరంభమైనాయి.  సెన్సెక్స్ 309 పాయింట్లు కక్షీణించి 60 వేల స్థాయినికోల్పోయగా, నిఫ్టీ 89పాయింట్లు క్షీణించి 17,824 వద్దకు చేరుకుంది.  ఆ తరువాత  నష్టాలను తగ్గించుకుని  సెన్సెక్స్‌ కేవలం 10 పాయింట్ల నష్టంతో 60105 వద్ద,నిఫ్టీ 18 పాయింట్లు  కోల్పోయి 17895 వద్ద స్థిరపడ్డాయి.   

హిందాల్కో, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బీపీసీఎల్‌ లాభపడగా, భారతి ఎయిర్టెల్‌, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, దివీస్‌ ల్యాబ్స్‌, అపోలో హాస్పిటల్స్‌, హెచ్‌యూఎల్‌ నష్టపోయాయి. గ్రేటర్ నోయిడాలో బుధవారం ఆటో ఎక్స్‌పో ప్రారంభం నేపథ్యంలో ఆటో స్టాక్స్ పై ఇన్వెస్టర్ల దృష్టి పెట్టారు.  వరుసగా మూడో రోజు కూడా డాలరు మారకంలో దేశీయ  కరెన్సీ రూపాయి సానుకూలత కొనసాగుతోంది.  25పైసలు ఎగిసి 81.56 వద్ద ఉంది. 

మరిన్ని వార్తలు