రానున్న ఫలితాల సెగ: మార్కెట్ల పతనం

30 Apr, 2021 16:22 IST|Sakshi

అటు పెరుగుతున్న  కేసులు, ఇటు రానున్న  ఎన్నికల ఫలితాలు

నాలుగు రోజుల లాభాలకు చెక్‌

14650 దిగువకు నిఫ్టీ

49 వేల స్థాయిని కోల్పోయిన సెన్సెక్స్‌

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలతో ముగిసాయి. నాలుగు రోజుల ర్యాలీకి  చెక్‌ చెప్పిన సూచీలు ఆరంభంలోనే బలహీన పడ్డాయి. చివరికి  సెన్సెక్స్‌ 984 పాయింట్లు కుప్పకూలి 48782 వద్ద నిఫ్టీ 284 పాయింట్ల పతనమై 14631 వద్ద  స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల​ షేర్లలోను ప్రాపిట్‌ బుకింగ్‌ కనిపించింది. తద్వారా  మే నెల సిరీస్‌ నెగిటివ్‌ నోట్‌ తో ముగిసింది.

ఒక దశలో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1068 పాయింట్ల వరకు పతనమైంది. నిఫ్టీ ముఖ్యమైన మానసిక స్థాయి 14,650 కన్నా దిగువకు చేరింది. ఒకవైపుఅడ్డూ అదుపూ లేకుండా  నమోదవుతున్న కోవిడ్‌ కేసులు, మరోవైపు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం  వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుక్ చేసుకున్నారని విశ్లేషకులు తెలిపారు.  త్రైమాసిక ఫలితాల ప్రభావంతో విప్రో ఆల్‌ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. డా.రెడ్డీస్,బజాజ్ ఆటో, హెచ్‌యుఎల్, దివీస్ ల్యాబ్స్,ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, నెస్లే లాభపడగా, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్, ఐసిఐసిఐ బ్యాంక్,ఎస్‌బీఐ, టాటా మోటర్స్ , అదానీ పోర్ట్స్, హిందాల్కో, హిందుస్తాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి నష్టపోయాయి.  మరోవైపు దేశీయ కరెన్సీ  రూపాయి ఫ్లాట్‌గా ముగిసింది. డాలరు మారకంలో  2 పైసలు తగ్గి 74.09 వద్ద స్థిరపడింది

చదవండి :  కరోనా: బాధను పంచుకుంటే తప్పేంటి? సుప్రీం ఫైర్‌
రెమిడెసివిర్‌ కొరత: కేంద్రం కీలక నిర్ణయం 

మరిన్ని వార్తలు