ఆర్‌బీఐ వడ్డింపు గుబులు: నష్టాల ముగింపు

6 Jun, 2022 15:37 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు  నష్టాల్లో ముగిసాయి.  ఆరంభంలో 230  పాయింట్ల దాకా కోల్పోయిన సెన్సెక్స్‌  చివరికి 94 పాయింట్ల నష్టంతో 55675 వద్ద ముగిసింది.  నిఫ్టీ 15 పాయింట్లు క్షీణించి16569 వద్ద స్థిరపడింది.  తద్వారా సెన్సెక్స్‌ 56వేల పాయింట్ల దిగువన, నిఫ్టీ నిఫ్టీ 16,600 దిగువన ముగిసింది. ఐటీ, మెటల్స్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. 

ముఖ్యంగా రానున్న పాలసీ రివ్యూ లో మరోసారి వడ్డీ రేటుపెంపు ఉంటుందన్న అంచనాలు మార్కట్‌ వర్గల్లో నెలకొన్నాయి. జూన్ 8న జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఫలితాలపై  పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. 

టెక్ మహీంద్రా   భారీగా నష్టపోయింది.  ఇంకా  విప్రో, బీపీసీఎల్, బ్రిటానియా,బజాజ్ ఫిన్‌సర్వ్ కూడా  నష్టపోయాయి.  అలాగే  ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్, టైటాన్, టాటా స్టీల్, ఎస్‌బీఐ,   భారతీ ఎయిర్‌టెల్ టాప్ లూజర్‌గా ఉన్నాయి. మరోవైపు  బజాజ్‌ ఆటో, జెఎస్‌డబ్ల్యు స్టీల్‌, టాటా,ఓఎన్‌జీసీ, సిప్లా ఎన్‌టీపీసీ, ఎం అండ్‌ ఎం,యాక్సిస్ బ్యాంక్ , సన్ ఫార్మా లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు