రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్‌

23 Jun, 2023 15:35 IST|Sakshi

సాక్షి,ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన​ మహారాష్ట్రలోని అలీబాగ్‌లో భారీ విలువైన ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. అరంగేట్రంలో రూ. 12.91 కోట్లతో ఆస్తులను కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. సుహానా ఖాన్ తన తొలి సంపాదనతో  ఈ ఆస్తులను కొన్నట్టు సమాచారం. 

మూడు ఇళ్లతోపాటు, ఒక ప్లాట్‌ను  కొనుగోలు చేసినట్టు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది అంతేకాదు రిజిస్ట్రేషన్ లో సుహానా పేరును రైతుగా నమోదు చేశారట.  సుహానా అమ్మమ్మ  సవితా ఛిబ్బర్, ఆమె సోదరి నమితా చిబ్బర్ డైరెక్టర్లుగా ఉన్న డెజా వు ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆస్తిని జూన్ 1న రిజిస్ట్రేషన్ చేసినట్లు  హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. (అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్‌: మరి ఇపుడు)

భూమి విస్తీర్ణం 1.5 ఎకరాలు,  2,218 చదరపు అడుగుల్లోఉన్న ఇళ్లు ఉన్నాయి. దీనికోసం 77.46 స్టాంప్ డ్యూటీ చెల్లించారు.  పఠాన్‌తో భారీ హిట్‌ కొట్టిన షారూఖ్ ఖాన్‌కు ఇప్పటికే అలీబాగ్ లో  సీ ఫేస్‌డ్‌ లగ్జరీ బంగ్లా  ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సునైనా కొనుగోలు చేసిన అలీబాగ్ లో దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్, అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియాకు ఇళ్లు కూడా ఉన్నాయి.  (టీసీఎస్‌లో భారీ కుంభకోణం: రూ.100 కోట్ల కమిషన్లు మింగేశారు!)

కాగా జోయా అక్తర్ దర్శకత్వంలో  ది ఆర్చీస్‌ అనే మూవీలో సుహానా తొలిసారిగా నటిస్తోంది. ది ఆర్చీస్ అనేది 1960ల నాటి భారతదేశంలోని లైవ్-యాక్షన్ మ్యూజికల్ సెట్. ఈ సినిమాలో బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో అదరగొట్టిన ఈ మూవీ  నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక సుహానా ఖాన్ స్టడీ విషయానికి వస్తే యూకేలోని సస్సెక్స్‌లోని ఆర్డింగ్లీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్‌, 2022లో న్యూయార్క్ యూనివర్శిటీ టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి నటనలో పట్టా పొందడం గమనార్హం. 

మరిన్ని వార్తలు