భెల్‌ కన్సార్టియం చేతికి భారీ ఆర్డరు.. మరో ఆరేళ్లలో 80 స్లీపర్‌ క్లాస్‌ వందే భారత్‌ రైళ్లు

12 Apr, 2023 10:16 IST|Sakshi

భారతదేశంలో ఇప్పుడు వందే భారత్‌ రైళ్ల హవా నడుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కొత్త వందే భారత్‌ మొదలైంది. అయితే రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్న ఈ సర్వీసులు త్వరలోనే దేశం మొత్తం మీద అందుబాటులో రానున్నాయి.

నివేదికల ప్రకారం, భెల్‌ (BHEL) నేతృత్వంలో ఉన్న కన్సార్టియం మరో ఆరు సంవత్సరాల్లో 80 స్లీపర్‌ క్లాస్‌ వందే భారత్‌ రైళ్లను అందించే ఆర్డర్ సొంతం చేసుకుంది. ఈ ఆర్డర్ విలువ సుమారు రూ. 9,000 కోట్లకంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ప్రస్తుతం స్లీపర్‌ క్లాస్‌ వందే భారత్‌ ట్రైన్ల వినియోగం కూడా చాలా అవసరమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

(ఇదీ చదవండి: కొత్త యాప్‌లో కలిసిపోయిన ట్విటర్.. ఎలన్ మస్క్ ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా!)

స్లీపర్‌ క్లాస్‌ వందే భారత్‌ రైళ్లు ఢిల్లీ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి హౌరా వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారికి అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ట్రైన్లు ఛైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ క్లాస్‌లను మాత్రమే కలిగి ఉంటాయి. అయితే స్లీపర్ క్లాసులు ఇప్పటికి అందుబాటులో లేదు.

(ఇదీ చదవండి: AIMA Awards 2023: ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న వ్యాపారవేత్తలు.. వీరే!)

స్లీపర్‌ క్లాస్‌ వందే భారత్‌ రైళ్లను అందించే భెల్‌ ఒక్క ట్రైన్ కోసం రూ. 120 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. కన్సార్టియం ICF చెన్నైలోని తయారీ యూనిట్‌తో పాటు భారతీయ రైల్వేలు కేటాయించిన రెండు డిపోలలో అందించిన ప్రత్యేక స్థలాన్ని కూడా సన్నద్ధం చేస్తుంది. మొత్తానికి స్లీపర్ క్లాస్ వందే భారత్‌ ట్రైన్స్ త్వరలోనే పట్టాలెక్కనున్నాయని స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు