మందేసుకుంటే కనిపెట్టేస్తుంది

24 Sep, 2023 11:40 IST|Sakshi

మద్యం తాగి వాహనాలు నడపడం, ప్రమాదాలకు కారణమవడం దాదాపు ప్రపంచవ్యాప్త సమస్య. వాహనాలను నడిపే మందుబాబులను పట్టుకోవడానికి పోలీసులు నగరాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తుంటారు. మూతి దగ్గర గొట్టం పెట్టి ఊదమంటారు. ఊదితే ఎంత మందేశారో తెలిసిపోతుంది.

కొందరు తెలివిమీరిన మందుబాబులు గొట్టం ముందు ఊదడానికి నానా విన్యాసాలు చేస్తారు. ఊదాల్సిన అవసరం లేకుండానే, మందుబాబులు ఏ డోసులో తాగారో ఇట్టే కనిపెట్టేసే బ్రాస్‌లెట్‌ ఇది. ‘సోబర్‌సేఫ్‌’ అనే అమెరికన్‌ కంపెనీ ‘సోబర్‌స్యూర్‌’ పేరుతో ఈ హైటెక్‌ బ్రాస్‌లెట్‌ను గత నెలలోనే మార్కెట్‌లోకి తెచ్చింది.

ఇందులో జీపీఎస్‌ టెక్నాలజీని కూడా అమర్చడంతో, దీనిని తొడుక్కున్న వారు ఎక్కడ ఉన్నారో తేలికగా కనిపెట్టవచ్చు. దీనిని వాచీలా చేతికి తొడుక్కుంటే, ఒంట్లో ఆల్కహాల్‌ ఎంత మోతాదులో ఉందో ఇట్టే తెరపై చూపిస్తుంది. దీని ధర 38 డాలర్లు (రూ.3,159) మాత్రమే!
 

మరిన్ని వార్తలు