ఈ కారును ఏడాదికి రెండు సార్లు ఛార్జ్ చేస్తే చాలు!

7 Nov, 2021 18:30 IST|Sakshi

ప్రస్తుతం వాహన మార్కెట్లు ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ఈవీ వాహన కొనుగోలుదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య పెట్రోల్ వాహనాల ట్యాంక్ నింపినంత వేగంగా ఈవీలను ఛార్జ్ చేయాలకపోతున్నాము. ఈ సమస్యను అధిగమించడానికి నెదర్లాండ్స్ దేశానికి చెందిన ఒక సంస్థ సౌర శక్తితో నడిచే కార్లను తయారు చేస్తున్నాడు. ఈ కారును రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఛార్జ్ చేస్తే చాలు అని పేర్కొంటున్నారు.

"లైట్ ఇయర్" అనే సంస్థ ప్రతిరోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేని సౌర శక్తితో నడిచే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది. "లైట్ ఇయర్ వన్" అనే పేరుతో పిలిచే ఈ కారును కొన్ని నెలల వరకు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు అని పేర్కొంది. లైట్ ఇయర్ సీఈఓ లెక్స్ హోఫ్స్లూట్(Lex Hoefsloot) మాట్లాడుతూ.. లైట్ ఇయర్ వన్ పై ఇప్పటికే 20 మన్నిక పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. త్వరలో ఈ కారును రహదారి మీదకు తీసుకొనిరావాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మోడల్ 83 కిలోమీటర్లకు ఒక వాట్ మాత్రమే వినియోగించినట్లు తెలిపింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కంటే మూడు రెట్లు తక్కువ.
 

(చదవండి: ఎలన్‌ మస్క్‌ సంచలనం: వెహికల్స్‌ ఎన్ని ఉన్నా, టెస్లా కార్ల తర‍్వాతే ఏదైనా)

రోజు రోజుకి కాలుష్యం పెరుగుతున్నట్లు తరుణంలో విద్యుత్ వాహనాల వాడకం అనివార్యంగా కనిపిస్తోంది. లైట్ ఇయర్ వన్ ప్రోటోటైప్ టెస్టింగ్ సమయంలో ఒకసారి ఛార్జ్ చేస్తూ 709 కిలోమీటర్లు(441 మైళ్ళు) వరకు వెళ్ళింది. ప్రస్తుత ప్రోటోటైప్ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే కొన్ని నెలల వరకు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. దీనిని సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది అని సీఈఓ తెలిపారు. 

మరిన్ని వార్తలు