వాయిదా పద్దతుల్లో విమాన టికెట్లు

9 Nov, 2021 09:32 IST|Sakshi

స్పైస్‌జెట్‌ ఈఎంఐ స్కీము

న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ కొత్తగా ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. విమాన టికెట్ల చార్జీలను సులభ వాయిదాల్లో (ఈఎంఐ) కట్టే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం మూడు, ఆరు లేదా 12 వాయిదాల్లో చెల్లించవచ్చు. ప్రారంభ ఆఫర్‌ కింద ఎటువంటి అదనపు భారం (వడ్డీ భారం) లేకుండా మూడు నెలల ఈఎంఐ ఆప్షన్‌ పొందవచ్చని సంస్థ తెలిపింది. 

ఈ స్కీమును ఉపయోగించుకోవడానికి ప్రయాణికులు తమ పాన్‌ నంబరు, ఆధార్‌ నంబరు వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వన్‌–టైమ్‌ పాస్‌వర్డ్‌తో ధృవీకరించాల్సి ఉంటుంది. ఏకీకృత చెల్లింపు విధానానికి సంబంధించిన యూపీఐ ఐడీ ద్వారా మొదటి వాయిదా చెల్లించాలి. అదే యూపీఐ ఐడీ నుంచి తదుపరి ఈఎంఐలు డిడక్ట్‌ అవుతాయి. ఈఎంఐ స్కీమును ఉపయోగించుకోవడానికి క్రెడిట్‌ కార్డ్‌ లేదా డెబిట్‌ కార్డ్‌ వివరాలను సమర్పించనక్కర్లేదు.
 

మరిన్ని వార్తలు