సాక్షి మనీ మంత్ర: గంటల వ్యవధిలో లక్షల కోట్లు ఆవిరి

20 Dec, 2023 16:18 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీనష్టాలతో ముగించాయి. ఉదయం ఉత్సాహంగా లాభాల ర్యాలీని కొనసాగించిన స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అన్ని ప్రధాన రంగాల్లోని కంపెనీల షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 931 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 303 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ 427 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ అత్యధికంగా 1488 పాయింట్లను కోల్పోయింది.

సెన్సెక్స్ దాని రికార్డు గరిష్ట స్థాయి 71,913 నుంచి 1,611 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ సూచీ ఆల్ టైమ్ హై 21,593 నుంచి 506 పాయింట్లు పతనమైంది. అయితే మార్కెట్ల పతనానికి ఓవర్ వ్యాల్యుయేషన్లు కారణంగా కొందరు నిపుణులు భావిస్తున్నారు.దాంతోపాటు కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు మరింత పతనం అయినట్లు తెలుస్తుంది. దాంతో ముందుగానే ఇన్వెస్టర్లు భారీగా విక్రయించినట్లు తెలుస్తోంది. సెక్టార్ల వారీగా లాభాలను స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు మెుగ్గుచూపటం మార్కెట్లు అమాంతంగా పడిపోవటానికి కారణమని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. దీంతో గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల సంపద ఆవిరి అయింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

>
మరిన్ని వార్తలు