సాక్షి మనీ మంత్ర: బుల్‌ జోరు మళ్లీ షురూ.. లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

20 Dec, 2023 10:00 IST|Sakshi

దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 21,550కి చేరుకోవడంతో భారతీయ సూచీలు సరికొత్త రికార్డు గరిష్టాలను చేరుకున్నాయి. సెన్సెక్స్ 351.89 పాయింట్లు లేదా 0.49% లాభంతో 71,789.08కి చేరుకోగా, నిఫ్టీ 105.40 పాయింట్లు లేదా 0.49% పెరిగి 21,558.50 వద్దకు చేరుకుంది. 

నిఫ్టీలో విప్రో, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, నెస్లే లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. మార్కెట్‌ సూచీలు గత కొన్ని ట్రేడింగ్ సెషన్‌ల్లో పుంజుకున్నప్పటికీ, కీలకమైన 21,500 మార్కును నిలబెట్టుకోవడానికి కొంత ఒడుదొడుకులకు లోనైంది. మార్కెట్లు ఇంతలా పెరిగినా బ్యాంకింగ్ స్టాక్స్‌ నుంచి సపోర్ట్‌ ఆశించినంత లేకుండాపోయింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస​్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, మారుతీసుజుకి, ఎన్‌టీపీసీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సన్‌ఫార్మా, ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నష్టాల్లో ఉన్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

>
మరిన్ని వార్తలు