సాక్షి మనీ మంత్ర: స్వల్పనష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

18 Dec, 2023 10:07 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 276.77 పాయింట్లు లేదా 0.39 శాతం క్షీణించి 71,206.98కి చేరుకోగా, నిఫ్టీ 72.40 పాయింట్లు లేదా 0.34 శాతం తగ్గి 21,384.30 వద్ద ట్రేడవుతోంది. 

నిఫ్టీలో ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, టైటాన్ కంపెనీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, సిప్లా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

గ్లోబల్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య నిఫ్టీ ఇటీవల భారీగా పుంజుకుంది. ఇంతలా పెరిగిన మార్కెట్‌ కొంత ఒడుదొడుకులకు లోనయ్యే​ అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ దీర్ఘకాలంగా మాత్రం సూచీలు మరింత లాభపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడు వారాల్లో దాదాపు నిఫ్టీ 700 పాయింట్లు లాభపడింది. గత వారం నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 7.2% పెరిగింది. ఇది మూడేళ్లలో వారాల పరంగా అధిక  పెరుగుదల.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

>
మరిన్ని వార్తలు