Stock Market Theme Wedding Card: వావ్‌! ఇలా కూడా పెళ్లి చేసుకుంటారా ?

2 Dec, 2021 12:55 IST|Sakshi

పెళ్లి వేడుకల్లో ఎన్నో కొత్త పద్దతులు వచ్చాయి. పెళ్లికి ఆహ్వానించే తీరులోనూ వెరైటీలో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తెలంగాణ యాసలో ముద్రిస్తున్న పెళ్లి పత్రికలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేశాయి. అచ్చంగా ఇదే తరహాలో స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో బిజీగా ఉండే ఓ డాక్టర్‌ తన వివాహ ఆహ్వాన పత్రికను వ్యాపార పరిభాషలో.. స్టాక్‌ మార్కెట్‌ టర్మినాలజీ అచ్చేయించి పంచాడు. ప్రస్తుతం నెట్టింట ఈ వెడ్డింగ్‌ కార్డు నవ్వులు పూయిస్తోంది.

మహారాష్ట్రంలోని నాందేడ్‌ జిల్లాకు వజీరాబాద్‌కి చెందిన డాక్టర్‌ సందేశ్‌ 2021 డిసెంబర్‌ 7న అనస్థిషీయిస్ట్‌ డాక్టర్‌ దివ్యని మనువాడబోతున్నాడు. ఈ సందర్భంగా బంధుమిత్రులను ఆహ్వానిస్తూ కొత్త పద్దతిలో వెడ్డింగ్‌ను ప్రింట్‌ చేయించి పంచాడు. ఈ సందర్భంగా పలు చమత్కారాలకు తెర తీశాడు సందేశ్‌. మీరు ఓ సారి ఆ వెడ్డింగ్‌ కార్డుపై ఓ లుక్కేయ్యండి.

- వివాహ ఆహ్వాన పత్రికను ఇన్షియల్‌ పబ్లిక​ ఆఫర్‌ (ఐపీవో)గా పేర్కొన్నాడు
- వరుడు, వధువులను రెండు వేర్వేరు కంపెనీలుగా తెలిపాడు. అంతేకాడు ఈ రెండు కంపెనీలు కలిస్తే బాగుంటుందని ప్రమోటర్లు నిర్ణయించినందు వల్ల ఈ మెర్జ్‌ జరుగుతోందంటూ పెళ్లిని రెండు వ్యాపార సంస్థల కలయికతో పోల్చాడు.
- పెళ్లి వేదికను స్టాక్‌ ఏక్సేంజీగా, పెళ్లికి వచ్చే బంధు మిత్రులకు ఇన్వెస్టర్ల హోదాని ఆపాదించాడు.
- పెళ్లి రిసెప్షన్‌ జరిగే తేదీలను బిడ్డింగ్‌ డేట్లుగా సంగీత్‌ కార్యక్రమాన్ని రింగింగ్‌ బెల్‌ అంటూ చమత్కరించాడు
- లంచ్‌ని డివిడెండ్‌గా వసతి కల్పించడాన్ని బోనస్‌గా పేర్కొంటూ పెళ్లి పత్రిక ఆద్యాంతం స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌పై తనకున్న ఇష్టాన్ని పేర్కొన్నాడు డాక్టర్‌ సందేశ్‌
- తన తల్లిదండ్రులను ప్రమోటర్లుగా పేర్కొన్నాడు.
- పెళ్లి పత్రిక బాటమ్‌ లైన్‌లో సైతం క్రియేటివిటీని పీక్స్‌కి తీసుకెళ్లాడు. మ్యూచువల​ఫండ్‌ సహీ హై, బంపర్‌ లిస్టింగ్‌, ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌డ్‌ అంటూ సరికొత్త  హిత వ్యాఖ్యాలను జోడించాడు.

ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడో చెప్పలేదు కదూ.. 2021 డిసెంబరు 6వ తేదిన పెళ్లి 7వ తేదిన రిసెప్షన్‌ ఉంది. కళ్యాణ వేదిక కర్నాటకలోని గుల్బర్గా జిల్లాలోని హుమ్నాబాద్‌ పట్టణంలోని ఓ ఫంక‌్షన్‌ హాల్‌.
 

మరిన్ని వార్తలు