టాటా గ్రూప్‌ నుంచి ఇలా విడిపోతాం..! 

30 Oct, 2020 08:24 IST|Sakshi

సుప్రీంకోర్టుకు  షాపూర్‌జీ పలోంజీ గ్రూప్‌ ప్రణాళిక 

సాక్షి, ముంబై: టాటా గ్రూప్‌తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంబంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు షాపూర్‌జీ పలోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. టాటా గ్రూప్‌లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రూప్‌ చైర్మన్‌గా  సైరస్‌ మిస్త్రీని బోర్డ్‌ తొలగించిన 2016 అక్టోబర్‌ 28 తర్వాత మిస్త్రీలు-టాటాల మధ్య న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి సంగతి తెలిసిందే. ‘‘టాటా సన్స్‌ అనేది రెండు గ్రూపులు కలిసిన కంపెనీ. టాటా గ్రూప్‌లో టాటా ట్రస్టులు, టాటా కుటుంబ సభ్యులు, టాటా కంపెనీలు ఉన్నాయి. వీరికి 81.6 శాతం వాటా ఉంది. ఇక 18.37 శాతం వాటా మిస్త్రీల కుటుంబానికి ఉంది’’ అని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసినట్లు షాపూర్‌జీ పలోంజీ గ్రూప్‌ ప్రకటన పేర్కొంది.  (టాటా గ్రూపునకు ఎస్పీ గ్రూప్ టాటా)

ప్రకటన ప్రకారం... విడిపోవడానికి సంబంధించిన ప్రణాళిక ఇలా:

  • ప్రో-రేటా స్ప్లిట్‌ ఆఫ్‌ లిస్టెడ్‌ అసెట్స్‌ (షేర్‌ ధరల విలువ ప్రాతిపదిక) 
  •  ప్రో-రేటా షేర్‌ ఆఫ్‌ ఆఫ్‌ ది బ్రాండ్‌    (ఇప్పటికే టాటాలు పబ్లిష్‌ చేసిన బ్రాండ్‌   విలువ ప్రాతిపదికన) 
  • నికర రుణాలు సర్దుబాటు చేసిన అన్‌లిస్టెడ్‌ అసెట్స్‌కు సంబంధించి తటస్థంగా ఉండే థర్డ్‌ పార్టీ వ్యాల్యూషన్‌ ప్రకారం...  
  • టాటా సన్స్‌ ప్రస్తుతం వాటా కలిగిన లిస్టయిన టాటా సంస్థల్లో ప్రో–రేటా షేర్ల ప్రాతిపదికన నాన్‌-క్యాష్‌ సెటిల్‌మెంట్‌ జరగాలని ఎస్‌పీ గ్రూప్‌ కోరుతోంది.  ఉదాహరణకు టీసీఎస్‌లో టాటాలకు 72 శాతం వాటా ఉంటే (టాటా సన్స్‌లో 18.37 శాతం ఎస్‌పీ గ్రూప్‌ యాజమాన్యం ప్రాతిపతికన) ఇందులో 13.22 శాతం ఎస్‌పీ గ్రూప్‌కు దక్కాల్సి ఉంటుంది. దీని ప్రస్తుత మార్కెట్‌ విలువ దాదాపు రూ.1,35,000 కోట్లు.  
  • నికర రుణానికి సంబంధించి సర్దుబాటు చేసిన బ్రాండ్‌ వ్యాల్యూ ప్రో–రేటా షేర్‌ను నగదు    లేదా లిస్టెడ్‌ సెక్యూరిటీల ద్వారా పరిష్కరించుకోవచ్చు.  
  • అన్‌లిస్టెడ్‌ కంపెనీల విషయానికి వస్తే, ఇరు పార్టీలకూ సమ్మతమైన వ్యాల్యూయేటర్లు వీటి విలువను నిర్ధారిస్తారు. దీనిని కూడా నగదు లేదా లిస్టెడ్‌ సెక్యూరిటీల ద్వారా పరిష్కరించుకోవచ్చు.
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు