Tata Motors: వాణిజ్య వాహనాల ధరలు 5 శాతం పెంపు

23 Mar, 2023 17:27 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టాటా మోటార్స్‌ అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలను మోడల్, వేరియంట్‌నుబట్టి 5 శాతం వరకు పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్‌ 1 నుంచి వర్తిస్తాయి. వచ్చే నెల నుంచి అమలులోకి వస్తున్న బీఎస్‌–6 రెండవ దశ కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను సిద్ధం చేసిన నేపథ్యంలో ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ ప్రకటించింది.   

ఇది కూడా చదవండి
కిమ్స్‌లో వాటాను విక్రయించిన పోలార్‌ క్యాపిటల్‌ 
న్యూఢిల్లీ: వైద్య సేవల్లో ఉన్న కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో (కిమ్స్‌) 1.38 శాతం వాటాలను పోలార్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ ఓపెన్‌ మార్కెట్లో విక్రయించింది. వీటి విలువ రూ.143.7 కోట్లు. డిసెంబర్‌ త్రైమాసికంలో కిమ్స్‌లో పోలార్‌కు 1.87 శాతం వాటాలు ఉన్నాయి.    
 

మరిన్ని వార్తలు