క్యూ 2 లో టీసి 'ఎ స్'!

12 Oct, 2023 02:08 IST|Sakshi

రూ.11,342 కోట్ల నికర లాభం; 8.7 శాతం అప్‌

ఆదాయం 7.9 శాతం పెరుగుదల; రూ.59,692 కోట్లు

రూ.17,000 కోట్లతో షేర్ల బైబ్యాక్‌కు సై..

షేరుకు రూ. 9 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌  

ముంబై: దేశీ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌).. మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆరి్థక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (2023–24, క్యూ2) కంపెనీ రూ. 11,342 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 10,431 కోట్లతో పోలిస్తే 8.7 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం 7.9 శాతం పెరుగుదలతో రూ. 55,309 కోట్ల నుండి రూ.59,692 కోట్లకు ఎగబాకింది. ఇక వాటాదారులకు టీసీఎస్‌ మరోసారి భారీ బైబ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించడం విశేషం. మరోపక్క, మందకొడి ఆరి్థక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగానికి ప్రతికూలతలు కొనసాగుతాయని కూడా కంపెనీ స్పష్టం చేసింది.

త్రైమాసిక ప్రాతిపదికన ఇలా...
ఈ ఆరి్థక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌ (క్యూ1లో) నమోదైన రూ.11,074 కోట్లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 2.5% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం క్యూ1లో రూ.59,381 కోట్లతో పోలిస్తే క్యూ2లో అర శాతం పెరిగింది.

ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు...
► క్యూ2లో కంపెనీ నిర్వహణ లాభం 9.1 శాతం వృద్ధితో రూ.14,483 కోట్లకు పెరిగింది. అదేవిధంగా నిర్వహణ మార్జిన్లు పావు శాతం పెరిగి
24.3 శాతానికి చేరాయి.
► భౌగోళికంగా చూస్తే, యూకే నుండి ఆదాయం 10.7 శాతం ఎగబాకగా, ఉత్తర అమెరికా నుండి స్వల్పంగా 0.1 శాతం వృద్ధి చెందింది. వర్ధమాన మార్కెట్లలో మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఆదాయం 15.9 శాతం వృద్ధి నమోదు కాగా, లాటిన్‌ అమెరికా 13.1 శాతం, ఆసియా పసిఫిక్‌ 4.1 శాతం, భారత్‌ ఆదాయం 3.9 శాతం చొప్పున పెరిగాయి.
► విభాగాల వారీగా.. ఇంధనం, వనరులు, యుటిలిటీల నుండి ఆదాయం 14.8 శాతం పెరిగింది. తయారీ రంగం నుండి ఆదాయం 5.8 శాతం, లైఫ్‌ సైన్సెస్‌–హెల్త్‌కేర్‌  5 శాతం పెరగ్గా, బ్యాంకింగ్‌–ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) మాత్రం మైనస్‌ 0.5 శాతంగా నమోదైంది.
► సెపె్టంబర్‌ చివరి నాటికి టీసీఎస్‌ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985కు చేరింది. క్యూ2లో నికరంగా 6,000 మంది సిబ్బంది తగ్గారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోవాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని టీసీఎస్‌ చీఫ్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ మిలింద్‌ లక్కడ్‌ చెప్పారు. క్యాంపస్‌ నియమకాలపై ఇప్పటికే దృష్టి పెట్టామన్నారు.
► క్యూ2లో కంపెనీ 11.2 బిలియన్‌ డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ఇందులో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ/5జీ, వాహన దిగ్గజం జేఎల్‌ఆర్‌కు సంబంధించిన డీల్స్‌ ప్రధానంగా ఉన్నాయి.
► ఇజ్రాయెల్‌లో 250 మంది కంపెనీ ఉద్యోగులు పని చేస్తున్నారని, యుద్ధ ప్రభావం అక్కడ తమ వ్యాపారాలపై పెద్దగా ప్రభావం చూపలేదని టీసీఎస్‌  సీఎఫ్‌ఓ ఎన్‌. గణపతి సుబ్రమణ్యం చెప్పారు.
► రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ రూ. 9 చొప్పన రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్‌ 19 కాగా, నవంబర్‌ 7న చెల్లించనుంది. దాదాపు రూ.3,300 కోట్లు ఇందుకు వెచి్చంచనుంది.

టీసీఎస్‌ షేరు ధర బుధవారం బీఎస్‌ఈలో అర శాతం నష్టంతో రూ. 3,610 వద్ద ముగిసింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి.

బైబ్యాక్‌ బొనాంజా @ రూ.17,000 కోట్లు
టీసీఎస్‌ బైబ్యాక్‌ పరంపరను కొనసాగిస్తోంది. రూ. 17,000 కోట్ల విలువైన షేర్లను వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. బైబ్యాక్‌ షేరు ధరను రూ. 4,150గా నిర్ణయించింది.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ‘టాటా’
కరోనా మహమ్మారి కారణంగా కల్పించిన రిమోట్‌ వర్కింగ్‌ (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) సదుపాయానికి టీసీఎస్‌ టాటా చెప్పింది. ఇకపై తమ ఉద్యోగులందరూ ఆఫీసుల నుంచే విధులు నిర్వర్తించాలని కంపెనీ బుధవారం ప్రకటించింది. కో–వర్కింగ్‌ వల్ల వ్యవస్థ విస్తృతం అవుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని టీసీఎస్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ మిలింద్‌ లక్కడ్‌ పేర్కొన్నారు.
మా సరీ్వస్‌లకు కొనసాగుతున్న డిమాండ్, క్లయింట్లు దీర్ఘకాల ప్రాజెక్టులకు కట్టుబడి ఉండటం, జెన్‌ ఏఐ ఇంకా ఇతర కొత్త టెక్నాలజీలను  ప్రయోగాత్మకంగా ఉపయోగించేందుకు చూపుతున్న ఆసక్తి.. మా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై భరోసా కలి్పస్తోంది. ఆరి్థక అనిశ్చితి కొనసాగుతోంది. దీనివల్లే ఆదాయ వృద్ధి అంతంతమాత్రంగా నమోదైంది. అయితే పటిష్టమైన డీల్స్‌ జోరుతో ఆర్డర్‌ బుక్‌ భారీగా వృద్ధి చెందింది. మొత్తం కాంట్రాక్ట్‌ విలువ (టీసీవీ) పరంగా క్యూ2లో రెండో అత్యధిక స్థాయిని నమోదు చేసింది.

– కె. కృతివాసన్, టీసీఎస్‌ సీఈఓ

మరిన్ని వార్తలు