వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌: మూడో వేవ్‌ ముప్పు!.. అయినా ఆఫీసులకు ఎంప్లాయిస్‌ రెడీ?

3 Sep, 2021 17:03 IST|Sakshi

కరోనా ప్రభావంతో ఇంటి నుంచే పని చేస్తున్న ఉన్న ఉద్యోగులకు.. జనవరి వరకు ఊరట ఇచ్చాయి టెక్‌ కంపెనీలు కొన్ని. ఈ తరుణంలో థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల కంటే ముందుగానే ఉద్యోగుల్ని రిమోట్‌ వర్క్‌కు ఫిక్స్‌ చేసేశాయి. అయితే భారత్‌కు చెందిన కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. ఈ లిస్ట్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(TCS).. దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరుతోంది. 

టీసీఎస్‌కు యాభై దేశాల్లో 250 లొకేషన్లలో ఆఫీసులు ఉన్నాయి.   సుమారు ఐదు లక్షల ఉద్యోగులు ఉన్నారు. వీళ్లలో భారత్‌లో పనిచేసే ఉద్యోగుల్లో 90 శాతం మంది కనీసం ఒక్కడోసు వేయించుకున్నారు. ఇదీగాక ఎంప్లాయిస్‌ ఫీడ్‌బ్యాక్‌ సర్వేలో సగం మందికిపైగా తిరిగి ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారట. అందుకే ఆఫీసులకు రావాలని కోరుతున్నామని చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎన్‌జీ సుబ్రమణియం చెబుతున్నారు. చదవండి: నో స్మోక్‌ ప్లీజ్‌!

వీలైనంత త్వరగా ఎనభై నుంచి తొంభై శాతం మంది ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు తెలిపారాయన. అయితే హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్ తమ పరిశీలనలోనూ ఉందని, 25 శాతం ఉద్యోగులతో ఆఫీసుల్ని నడిపించే దిశగా టీసీఎస్‌ ప్రణాళిక వేస్తోందని, అయితే 2025 వరకు అది అమలు కావొచ్చని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారాయన. 

క్లిక్‌ చేయండి: వర్క్‌ఫ్రమ్‌ హోం.. గూగుల్‌ కీలక ప్రకటన

కారణాలు.. 
నిజానికి వర్క్‌ ఫ్రమ్‌ హోం విషయంలో టీఎస్‌ఎస్‌ ముందు నుంచే ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ తొందర పెడుతోంది. రెండో వేవ్‌ కంటే ముందు ఒకసారి చాలామంది ఉద్యోగులకు ఆఫీసులకు రావాలంటూ ముందస్తు మెయిల్స్‌ కూడా పంపింది. ఇక సెకండ్‌వేవ్‌ ఉధృతి కొంచెం తగ్గాక.. కీలక విభాగాల్లో పని చేసే ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేసింది. టీసీఎస్‌ మాత్రమే కాదు.. విప్రో, ఇన్ఫోసిస్‌ లాంటి కంపెనీలన్నింటివి ఇప్పుడు ఇదే బాట.  బిల్డింగ్‌ల మేనేజ్‌మెంట్‌ ఒక సమస్యగా మారడం, క్యాంటీన్‌ తదితర సౌకర్యాలకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాలు ఆగిపోయి కోట్లలో నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే ఐటీ కారిడార్లను తిరిగి ఎంప్లాయిస్‌తో కళకళలాడించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో.. ఈ నిర్ణయం అమలు అవుతుందా? లేదా? అనేది ఉద్యోగుల్లోనూ ఒక ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

చదవండి: WFM..ఇక ఆఫీసులకు గుడ్‌బై!

>
మరిన్ని వార్తలు