Sakshi News home page

Infosys Narayana Murthy: పనిగంటలపై మరోసారి కీలక వ్యాఖ్యలు.. కష్టం వృధా కాలేదు

Published Sat, Dec 9 2023 8:14 PM

Narayana Murthy Worked 85 To 90 Hours A Week - Sakshi

వారానికి 70 గంటల పని వ్యాఖ్యలు కొంత మరుగున పడగానే.. మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్ఫోసిస్‌లో వారానికి 85 నుంచి 90 గంటలు పని చేసిన సందర్భాలున్నాయన నారాయణ మూర్తి తాజాగా వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు 'నారాయణ మూర్తి' 1994 వరకు వారానికి 85 నుంచి 90 గంటలకు పైగా పనిచేసినట్లు వెల్లడించారు. 

ఉదయం 6:20 గంటలకు ఆఫీసుకు చేరుకొని రాత్రి 8:30 గంటలకు బయట వచ్చేవాడినని, అలా వారంలో ఆరు రోజులు చేసేవాడినని చెప్పుకొచ్చాడు. 40 సంవత్సరాల వయసులో కూడా వారానికి 70 గంటలు పనిచేసినట్లు తెలిపారు. నా కష్టం ఎప్పుడూ వృధా కాలేదని వెల్లడించారు.

పేదరికం నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం కష్టపడి పని పనిచేయడమే, దీనిని తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పకుండా నేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇదీ చదవండి: సుధామూర్తి రాజకీయాల్లోకి వస్తుందా? ఇదిగో క్లారిటీ..

గత కొన్ని రోజులకు ముందు ఒక ఇంటర్వ్యూలో యువత వారానికి 70 గంటలు పనిచేయాలని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్‌ ప్రజలు తమ దేశాలను అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి, ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి ఎక్కువ పనిగంటలు చేసారని తెలియజేస్తూ.. మనదేశంలో కూడా అలా చేస్తే బాగుంటుందని తన అభిప్రాయం వెల్లడించారు. నారాయణ మూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అప్పుడే తెగ వైరల్ అయ్యాయి.

Advertisement

What’s your opinion

Advertisement