'కీచక బాస్‌' 5 వేల మంది మహిళలపై లైంగిక వేధింపులు..!

28 Nov, 2021 13:09 IST|Sakshi

ప్రముఖ టెక్ బిలియనీర్ మైఖేల్ గోగున్‌ మరోసారి చిక్కల్లో పడ్డారు. తన సొంత సంస్థలో పనిచేసే నలుగురు మాజీ ఉద్యోగులు 135 పేజీల ఫిర్యాదుతో కోర్టును ఆశ్రయించారు. మహిళలపై చెప్పుకోలేని విధంగా దారుణాలకు ఒడిగట్టిన మైఖేల్‌ పై ఫిర్యాదు చేసేందుకు 135పేజీలు సరిపోవని వాపోయారు. తమని వేధించినందుకు కోర్ట్‌ న్యాయం చేయాలని,  800 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ దావా వేశారు. ఈ దావాపై న్యూయార్క్ పోస్ట్  ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 

మైఖేల్ గోగున్‌ 1996 నుంచి 2016 మధ్య కాలంలో సెక్వోయా క్యాపిటల్‌కు చెందిన నాయకత్వం వహించారు. ఆ సమయంలో మైఖేల్‌ గోగున్‌ 54 కంపెనీ పెట్టుబడులను కలిపి 64 బిలియన్ల కంటె ఎక్కువ మార్కెట్ వ్యాల్యూ పెరిగింది. అదే సమయంలో 2016లో ఆయనపై లైంగిక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరోపణలపై సెక్వోయా క్యాపిటల్ యాజమాన్యం ఆయన్ని తొలగించింది. ఆ తర్వాత సొంతంగా అమింటర్ గ్రూప్‌ ను స్థాపించాడు. అహర్నిశలు కష్టపడి కంపెనీకి మంచి ఫలితాల్ని రాబట్టారు. అమింటర్‌ పనితీరుతో టెక్‌ కంపెనీలు యాపిల్‌, సిస్కో, గూగుల్‌, యూట్యూబ్‌,పేపాల్‌,ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సంస్థలే నిధులు కోసం మైఖేల్‌ గోగున్‌ చుట్టూ క్యూ కట్టేవి. 

అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గోగున్‌ మైఖేల్‌ గోగున్‌ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే వారు. ముఖ్యంగా మహిళల్ని వేధిస్తున్నారనే ఆరోపణలు ఆయనకు అప్రతిష్టని తెచ్చి పెట్టాయి. తాజాగా గోగున్‌ చెందిన సంస్థలో పనిచేసిన నలుగురు మాజీ ఉద్యోగులు అతనిపై $800 మిలియన్ల దావా వేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం..135 పేజీల ఫిర్యాదులో మోంటానాలోని వైట్ ఫిష్ పట్టణానికి చెందిన హోటల్స్‌కు తీసుకెళ్లి మహిళల్ని వేధించేవారని బాధితులు పేర్కొన్నారు. గోగున్‌ 5,000 కంటే ఎక్కువ మంది మహిళల్ని వేధించాడని ఆరోపించారు. ఆ ఆకృత్యాలు జరిగే సమయంలో సైలెంట్‌గా ఉండేందుకు బాధితులకు పెద్ద ఎత్తున బహుమతులు ఇచ్చేవాడని పేర్కొన్నారు. మహిళలపై చెప్పుకోలేని విధంగా దారుణాలకు ఒడిగట్టిన మైఖేల్‌ పై ఫిర్యాదు చేసేందుకు 135పేజీలు సరిపోవని అన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కోర్ట్‌కు విన్నవించారు. కాగా, ప్రస్తుతం ఈ దావాపై విచారణ కొనసాగుతుండగా..త్వరలో కేసుకు సంబంధించి పూర్తి స‍్థాయిలో తీర్పు వెలువడనుంది.

చదవండి: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్‌ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు

మరిన్ని వార్తలు