నాలుగు టెస్లా మోడల్ కార్లకు భారత్ ఆమోదం..!

31 Aug, 2021 19:11 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశంలో నాలుగు టెస్లా మోడల్ కార్లను తయారు చేయడానికి/దిగుమతి చేసుకోవడానికి సంస్థ ఆమోదం పొందింది. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు టెస్లా సంస్థ తన కార్లను రాబోయే కొద్ది రోజుల్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ తన వెబ్ సైట్ లో టెస్లా వాహనాలు భారతదేశంలో సురక్షితమైనవిగాను, రహదారి యోగ్యమైనవిగా పేర్కొంది. ఉద్గారం & భద్రత పరంగా ఈ వాహనం భారత మార్కెట్ అవసరాలకు సరిపోయేలా ఉన్నదా? లేదా అని ఈ పరీక్షలు చేసినట్లు సంస్థ పేర్కొంది.(చదవండి: Tesla: టెస్లాను నమ్మొచ్చా?)

టెస్లా ఫ్యాన్ క్లబ్ ప్రకారం.. ఆమోదం పొందిన కారు మోడల్స్ 3, మోడల్ వై వేరియెంట్లుగా ఉండే అవకాశం ఉంది. భారతీయ మార్కెట్లో పట్టు సాధించడం కొరకు తన దూకుడు పెంచినట్లు తెలుస్తుంది. బ్లూమ్ బెర్గ్ ఒక నివేదికలో పేర్కొన్న విధంగా ఈవీలు మన దేశం వార్షిక కార్ల అమ్మకాల్లో 1 శాతం మాత్రమే ఉన్నాయి. భారతదేశంలోనే దిగుమతి సుంకాలు ప్రపంచంలో అత్యధికంగా ఉన్నాయని ఎలోన్ మస్క్ ఇంతకు ముందు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలో త్వరలో పెట్రోల్ వాహనాల పోటీగా గ్రీన్ ఎనర్జీ వాహనాలను చూస్తారని ఆయన అన్నారు. దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.

>
మరిన్ని వార్తలు