ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కి–సుమీత్‌ జోడీ

7 Dec, 2023 00:26 IST|Sakshi

గువాహటి: స్వదేశంలో జరుగుతున్న గువాహటి మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్‌ రెడ్డి (భారత్‌) జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్‌ ద్వయం 20–22, 21–15, 21–16తో రఫ్లీ రమంద–ఇందా సరి జమీల్‌ (ఇండోనేసియా) జంటను ఓడించింది.

పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్‌ 21–14, 17–21, 7–21తో కువో కువాన్‌ లిన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో... తరుణ్‌ 11–21, 14–21తో జియా జెంగ్‌ జేసన్‌ (సింగపూర్‌) చేతిలో... ప్రణయ్‌ 12–21, 17–21తో కార్తికేయ (భారత్‌) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సామియా 21–12, 21–11తో తెలంగాణకే చెందిన గద్దె రుత్విక శివానిపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

>
మరిన్ని వార్తలు