India Envoy Meets Taliban Political Officer in Doha - Sakshi
Sakshi News home page

Talibans: తాలిబన్లతో భారత రాయబారి చర్చలు

Published Tue, Aug 31 2021 6:46 PM

 India Envoy Meets Taliban Political Officer in Doha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తరువాత భారత్‌తో సంబంధాల విషయంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఖతార్‌లోని భారత రాయబారి దీపక్ మిట్టల్  తాలిబన్‌ ప్రతినిధి షేర్ మహ్మద్ అబ్బాస్‌ మధ్య చర్చలు విశేషంగా నిలిచాయి. మంగళవారం దోహాలోని భారత రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

తాలిబన్ల  అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరిగిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుపక్షాల మధ్య మొట్టమొదటి అధికారిక దౌత్య సంబంధాలపై జరిగిన ఈ మీట్‌లో భారత్‌ లేవనెత్తిన సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని తాలిబన్‌ ప్రతినిధి హామీ ఇచ్చారు. అఫ్గన్‌ మట్టిని భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలకు ఏంతమాత్రం ఉపయోగించరాదని మిట్టల్ తాలిబన్లను కోరారు.

ఈ చర్చల్లో అఫ్తాన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత, వారిని వేగంగా తరలింపు లాంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే అఫ్గాన్‌ జాతీయులు, ముఖ్యంగా మైనారిటీలు, భారతదేశాన్ని సందర్శించాలనుకునే వారి ప్రయాణ ఏర్పాట్లు కూడా చర్చకు వచ్చినట్టు తెలిపింది. భారత్‌తోవాణిజ్య, ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తామని, తమ వల్ల  భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదని ప్రకటించిన సంగతి తెలిసిందే.

చదవండి:  taliban: మా నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదు

Advertisement
Advertisement