2020లో భారీ లాభాన్ని ఆర్జించిన టిక్‌టాక్

11 Jan, 2021 17:00 IST|Sakshi

చైనీస్ షార్ట్-వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ 2020లో 540 మిలియన్ డాలర్ల లాభంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయకమైన యాప్ గా నిలిచింది. భారతదేశంలో నిషేధించబడినా, యునైటెడ్ స్టేట్స్‌లో న్యాయ పోరాటం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా.. సుమారు 400 కోట్ల లాభాన్ని ఆర్జించింది. యూత్ ఎక్కువగా మాట్లాడే డేటింగ్ యాప్ టిండర్ 513 మిలియన్ల డాలర్ల లాభం పొంది రెండవ అత్యంత లాభదాయక యాప్ గా నిలిచింది. యాప్ అనలిటిక్స్ సంస్థ అప్టోపియా విడుదల చేసిన డేటా ప్రకారం.. 478 మిలియన్ డాలర్ల లాభంతో యూట్యూబ్ మూడవ అత్యంత లాభదాయక యాప్ గా, తరువాత డిస్నీ 314 మిలియన్ డాలర్ల లాభంతో, టెన్సెంట్ వీడియో 300 మిలియన్ డాలర్ల లాభంతో తర్వాత స్థానాలలో నిలిచాయి. నెట్‌ఫ్లిక్స్ యాప్ 209 మిలియన్ల డాలర్ల లాభంతో 10వ స్థానంలో ఉంది.(చదవండి: వన్‌ప్లస్ బ్యాండ్ వచ్చేసింది!)

చైనా నుండి వచ్చిన డేటా మినహా అన్ని ఐఓఎస్, గూగుల్ ప్లే డేటాతో కలిపి ప్రకటించినట్లు యాప్ అనలిటిక్స్ సంస్థ అప్టోపియా ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్ అనలిటిక్స్ సంస్థ ప్రకారం.. టిక్‌టాక్ 2020 ఏడాదిలో 800 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్లతో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్ గా నిలిచింది. దీని తర్వాత వాట్సాప్ 600 మిలియన్లు, ఫేస్‌బుక్ 500 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ 500 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో నాల్గవ స్థానంలో ఉంది. అలాగే జూమ్ 400 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో ఐదవ స్థానంలో ఉంది. 2020, జూన్ 29న టిక్‌టాక్ తో సహా 59 చైనీస్ అనువర్తనాలను భారత హోం మంత్రిత్వ శాఖ నిషేదించిన సంగతి మనకు తెలిసిందే.

మరిన్ని వార్తలు