బంగారం కొనుగోలు దారుల‌కు శుభ‌వార్త‌!

27 Feb, 2022 14:36 IST|Sakshi

రష్యా - ఉక్రెయిన్ మధ్య నాలుగు రోజులుగా యుద్ధం కొన‌సాగుతుంది. ఆ యుద్ధం ప్ర‌భావం బులియ‌న్ మార్కెట్‌పై ప‌డ‌డంతో బంగారం ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. అయితే గ‌త రెండు మూడురోజుల నుంచి బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.500 త‌గ్గి మార్కెట్‌లో రూ.46,350 ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర రూ.540 త‌గ్గి రూ.50,570కి చేరింది.  

దేశీయ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయ్

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,570గా ఉంది. 

విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,570 ఉంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,570 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,570గా ఉంది. 

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,570గా ఉంది. 

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,380 ఉండ‌గా, 24 క్యారెట్ల ధర రూ.51,700గా ఉంది.  

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,570 ఉంది. 

మరిన్ని వార్తలు