లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

17 Aug, 2021 09:40 IST|Sakshi

మంగళవారం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.భారత్, రష్యా ద్వైపాక్షిక ఇంధన సహకార బలోపేతంపై దృష్టి సారించడంతో పాటు..రష్యాలోని ఆయిల్, గ్యాస్‌ ప్రాజెక్టులపై భారత్‌ పెట్టుబడులు 15 బిలియన్‌ డాలర్లను మించడం వంటి అంశాలు మార్కెట్‌పై ప‍్రభావాన్ని చూపాయి.

దీంతో మంగళవారం ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్సె 71.30 పాయింట్ల లాభంతో 55,653 వద్ద ట్రేడ్‌ అవుతుండగా.. నిఫ్టీ 10.50 స్వల్ప లాభంతో 16,573 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. మాస్‌ ఫిన్‌ సర్వీస్‌, డీసీఎం శ్రీరామ్‌, అపోలో హాస్పిటల్‌, eClerx సర్వీసెస్‌, పెట్రో నెట్‌ ఎల్‌ఎన్‌జీ స్టాక్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు