స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు!

8 Apr, 2022 09:37 IST|Sakshi

ఆర్‌బీఐ పాలసీ సమావేశ నిర్ణయాల ప్రకటన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండడంతో  దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు ఉదయం 9.35గంటలకు సెన్సెక్స్‌ 32 పాయింట్లు లాభపడి 59060 వద్ద, నిఫ్టీ 24పాయింట్లు లాభపడి 17654 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. 

కోల్‌ ఇండియా, యూపీఎల్‌, టాటాకాన్స్‌, హిందాల్కో, జేఎస్‌డ్ల్యూ స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బీపీసీఎల్‌, బ్రిటానియా, టైటాన్‌ కంపెనీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కిప్లా, టెక్‌ మహీంద్రా,టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్టీపీసీ, హీరో మోటోకార్పొరేషన్‌ యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.  

మరిన్ని వార్తలు