ఉక్రెయిన్‌–రష్యా యుద్ధ సంక్షోభం..నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు!

11 Apr, 2022 09:46 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూల ప్రభావాల్ని చూపుతున్నాయి. దీంతో సోమవారం ఉదయం స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

ముఖ్యంగా ఈ వారంలో జరిగే మూడురోజుల ట్రేడింగ్‌లో కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధ సంక్షోభం, ద్రవ్యోల్బణం అంశాలు స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. ఆ అంచనా ప్రకారమే..సోమవారం ఉదయం 9.40 నిమిషాలకు సెన్సెక్స్‌ 430 పాయింట్ల నష్టపోయి 59010 పాయింట్ల వద్ద నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 17667 పాయింట్ల వద్ద నష్టాలతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. 

ఇక జేఎస్‌డ్ల్యూ స్టీల్‌, అపోలో హాస్పిటల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ,ఎస్‌బీఐ,పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఇన్ఫోసిస్‌,ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, నెస్లే, హీరోమోటోకార్ప్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.    

మరిన్ని వార్తలు