లాభాలతో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

3 Aug, 2021 09:55 IST|Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట‍్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో మంగళవారం ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 213 పాయింట్ల లాభంతో 53,264.33 వద్ద ట్రేడింగ్‌ కొనసాగుతుండగా..నిఫ్టీ  66 పాయింట్లతో 15,963.85 వద్ద  లాభాలతో  ట్రేడింగ్‌ కొనసాగుతుంది. 

కాగా, టాప్‌ టెన్‌ స్టాక్స్‌ లో ఏషియన్‌ పెయింట్స్‌, హౌసింగ్‌ డెవలప్‌ మెంట్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టైటాన్‌ కో లిమిటెడ్‌, టెక్‌ మహీంద్రా, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, విప్రో లిమిటెడ్‌, బజాస్‌ ఫిన్‌ సర్వ్‌, టాటా కన్సెల్టెన్సీ సర్వీస్‌లు లాభాల‍్ని మూటగట్టుకున్నాయి. 

ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స‍్టీల్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌సీఎల్‌,శ్రీ సిమెంట్‌, బజాజ్‌ ఆటో, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గ్రసీమ్‌ ఇండస్ట్రీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు