Upcoming Electric Bikes In 2022: బైక్ ప్రియులకు పండగే.. 2022లో రాబోతున్న ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే!

24 Nov, 2021 17:56 IST|Sakshi

దేశంలో రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల ఆసక్తిని గమనించిన కంపెనీలు వారికి తగ్గట్టు సరికొత్త ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో స్కూటర్, కార్లలో అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నప్పటికీ బైక్ విషయానికి వస్తే చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. 2022లో ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు చాలా కంపెనీలు పోటీపడుతున్నాయి. 2022లో ఈవీ తయారీ కంపెనీలు తీసుకొనిరాబోతున్న బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1) అల్ట్రా వయొలెట్ ఎఫ్77
బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ అల్ట్రా వయొలెట్ తన మొదటి బైక్ అల్ట్రా వయొలెట్ ఎఫ్77ను మార్చి 2022 నాటికి భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ అల్ట్రా వయొలెట్ ఎఫ్77. అల్ట్రా వయొలెట్ ఎఫ్77 బైక్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ఆటోమేకర్ పేర్కొంది. 

  • అంచనా ధర: సుమారు రూ.3 లక్షలు
  • రేంజ్: సుమారు 150 -200 కిలోమీటర్ల రేంజ్
  • టాప్ స్పీడ్ : 200 కిలోమీటర్లు
  • ఛార్జింగ్ సమయం: 5 గంటలు

2) ఎమోట్ ఎలక్ట్రిక్ సర్జ్ 10కె
ప్రముఖ ఈవీ స్టార్టప్ ఎమోట్ సర్జ్ తన ఎలక్ట్రిక్ సర్జ్ 10కె ఈవీ బైకును వచ్చే ఏడాది 2022లో తీసుకొని రానున్నారు. దీనిలో 4-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇందులో మూడు బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ప్రతి బ్యాటరీ ప్యాక్ 150 కిమీ రేంజ్ ఇస్తుంది. దీనిని ఫాస్ట్ చార్జర్ సహాయంతో కేవలం అరగంట లోపు ఛార్జ్ చేయవచ్చు.

  • అంచనా ధర: సుమారు రూ.1 లక్ష
  • రేంజ్: సుమారు 450 కిలోమీటర్ల రేంజ్
  • టాప్ స్పీడ్ : 120 కిలోమీటర్లు
  • ఛార్జింగ్ సమయం: 4 గంటలు

3) రివోల్ట్ కేఫ్ రేసర్
ప్రముఖ ఈవీ స్టార్టప్ రివోల్ట్ ఇప్పటికే మార్కెట్లోకి రివోల్ట్‌ ఆర్‌వీ 400 బైక్ తీసుకొని వచ్చారు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ కేఫ్ రేసర్ ను తీసుకొని రావాలని చూస్తున్నారు. దీనిని వచ్చే ఏడాది 2022 మధ్యలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇది 3.9 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ చేత పనిచేస్తుంది. ఇది 5.1కెడబ్ల్యు గరిష్ట అవుట్ పుట్ పవర్ అందిస్తుంది. 

  • అంచనా ధర: సుమారు రూ.1.5 లక్షలు
  • రేంజ్: సుమారు 150 కిలోమీటర్ల రేంజ్
  • టాప్ స్పీడ్ : 95 కిలోమీటర్లు
  • ఛార్జింగ్ సమయం: 5 గంటలు

4) ఎర్త్ ఎనర్జీ ఎవోల్వ్ జెడ్
దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టార్టప్ సంస్థ ఎర్త్ ఎనర్జీ తన ఎవోల్వ్ జెడ్ ఎలక్ట్రిక్ బైక్ రూ.1.42 లక్షలకు విక్రయించనుంది. ఈ కంపెనీ ఎవోల్వ్ జెడ్ బైక్ 2022 మార్చి చివరి నాటికి అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇది 5.2 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ చేత పనిచేస్తుంది. ఇది 7.2 కెడబ్ల్యు గరిష్ట అవుట్ పుట్ పవర్ అందిస్తుంది. 

  • ధర: రూ.1.42 లక్షలు
  • రేంజ్: సుమారు 100 కిలోమీటర్ల రేంజ్
  • టాప్ స్పీడ్ : 95 కిలోమీటర్లు
  • ఛార్జింగ్ సమయం: 3 గంటలు

5) ఎనిగ్మా కేఫ్ రేసర్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఎనిగ్మా ఇప్పటికే అనేక మోడళ్ల స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వచ్చే ఏడాదిలో 2022లో తన ఎలక్ట్రిక్ బైక్ కేఫ్ రేసర్ ను లాంచ్ చేయలని చూస్తుంది. ఇది నాలుగు రంగులలో లభిస్తుంది. 

  • అంచనా ధర: రూ.1.5 లక్షలు
  • రేంజ్: సుమారు 140 కిలోమీటర్ల రేంజ్
  • టాప్ స్పీడ్ : 136 కిలోమీటర్లు
  • ఛార్జింగ్ సమయం: 4 గంటలు
     
మరిన్ని వార్తలు