782 కోట్ల లావాదేవీలతో.. ఏకంగా రూ. 12.82 లక్షల కోట్ల యూపీఐ పేమెంట్స్‌

3 Jan, 2023 07:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ద్వారా గత డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో చెల్లింపులు జరిగాయి. 782 కోట్ల లావాదేవీల ద్వారా ఏకంగా రూ. 12.82 లక్షల కోట్ల పేమెంట్స్‌ నమోదయ్యాయి.

2016లో ప్రారంభమైన యూపీఐ ప్లాట్‌ఫామ్‌ దేశీయంగా డిజిటల్‌ పేమెంట్స్‌ విభాగంలో విప్లవాత్మక మార్పులు తేవడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆర్థిక సేవల విభాగం సోమవారం మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసింది.

యూపీఐ చెల్లింపులు గతేడాది అక్టోబర్‌లో తొలిసారిగా రూ. 12 లక్షల కోట్ల మార్కును దాటాయి. నవంబర్‌లో రూ. 11.90 లక్షల కోట్లకు తగ్గినా, డిసెంబర్‌లో మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం దాదాపు 381 బ్యాంకులు యూపీఐ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు