భారత్‌లో మరో ఈవీ దిగ్గజం.. కార్ల తయారీ దిశగా అడుగులు!

29 Oct, 2023 12:12 IST|Sakshi

ఆసియా దేశమైన వియత్నామీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం విన్‌ఫస్ట్ ఆటో భారత్‌లో ఈవీ కార్లను తయారు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తమిళనాడులో రెండు ప్రాంతాలను ఎంపిక చేసుకుంది. ఈ రెండు ప్రాంతాల్లో కార్లను మ్యానిఫ్యాక్చరింగ్‌ చేసేలా యూనిట్లను నెలకొల్పితే ఎలా ఉంటుందనే అంశంపై చర్చిస్తుంది. 

భారత్‌లో ఎలక్ట్రిక్‌ కార్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాల దిగ్గ ఆటోమొబైల్‌ కంపెనీలు ఇక్కడే వాహనాల్ని తయారు చేసి అమ్మాలని భావిస్తున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

పలు నివేదికల ప్రకారం.. విన్‌ఫస్ట్‌కి చెన్నైకి ఉత్తరాన ఉన్న మనలూర్ ప్రాంతంతో  పాటు రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలలో ఒకటైన టుటికోరిన్‌లో ల్యాండ్‌ను చూపించారు రాష్ట్ర అధికారులు. ఆఫీస్‌ నిర్వహణ కోసం ప్లాట్‌లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.  

ఈ నెల ప్రారంభంలో భారతదేశంలో తయారీ కేంద్రాన్ని స్థాపించాలనే ఉద్దేశాన్ని ధృవీకరించిన కంపెనీ, 2026 నాటికి వాహనాలను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించే లక్ష్యంతో సుమారు  200 మిలియన్లను పెట్టుబడి పెట్టనుంది. విన్‌ఫాస్ట్ తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తమిళనాడు తర్వాత గుజరాత్‌ను ఎంపిక చేసుకుందని అక్కడ కూడా స్థల అన్వేషణలో ఉందని సమాచారం.

 ప్రపంచంలోని అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థగా పేరున్న ఈ కంపెనీకి భారత్‌లో మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ప్రారంభించడం మరింత ఉపయోగకరంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు