WhatsApp Down కలకలం: స్పందించిన మెటా

25 Oct, 2022 13:35 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇంటస్టెంట్‌ మెసేజ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ సేవలు నిలిచి పోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.ప్రపంచ వ్యాప్తంగా  వాట్సాప్‌ పనిచేయడం లేదంటూ ట్విటర్‌లో వేలాది మంది యూజర్లు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో వాట్సాప్‌  ఎర్రర్‌, వాట్సాప్‌ డౌన్‌  హ్యాష్‌ట్యా గ్స్‌   ట్రెండింగ్‌లో నిలిచాయి.  దీంతో   సంస్థ స్పందించింది. 

ప్రస్తుతం కొంతమందికి మెసేజెస్‌ పంపడంలో సమస్య ఉందని గుర్తించాం. ఈ సమస్యలను వీలైనంత త్వరగా సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నాము. త్వరలోనే అందరికీ సేవలను అందుబాలుఓకి తీసుకొస్తామని  మెటా కంపెనీ ప్రతినిధి తెలిపారు. వినియోదారులు ఆందోళన చెందాల్సిన అవసరం  లేదని హామీ ఇచ్చారు.  మరోవైపు వాట్సాప్‌ సేవలకు అంతరాయం రావడంతో  దేశవ్యాప్తంగా వేలాదిమంది యూజర్లు సోషల్‌ మీడియాలో జోక్స్‌, సెటైర్లతో తమ స్పందన తెలియ జేస్తున్నారు.

మరిన్ని వార్తలు