జస్ట్‌ సింపుల్‌.. వాట్సాప్‌లో వాయిస్‌ కాల్స్‌ రికార్డ్‌ ఇలా చేయండి

25 Aug, 2021 10:21 IST|Sakshi

WhatsApp Voice Calls Recording Tips: కాల్‌ రికార్డింగ్‌లు.. ఈ మధ్యకాలంలో ‘సేఫ్‌సైడ్‌’ వ్యవహారాలుగా మారిపోయాయి. ఇంటర్వ్యూలు, ఆన్‌లైన్‌ క్లాసుల రికార్డింగ్‌.. అన్నింటికి మించి ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా కాల్‌ రికార్డింగ్‌లు చేస్తుండడం చూస్తున్నాం. అయితే వాట్సాప్‌ కాల్స్‌కు రికార్డింగ్‌ ఆప్షన్‌ ఉండదని, అవతలివాళ్లు రికార్డు చేయలేరేమోనని చాలామంది పొరపడుతుంటారు. కానీ, వాట్సాప్‌ కాల్స్‌ను కూడా రికార్డు చేయొచ్చు. 

సింపుల్‌.. ఫోన్‌లో వాయిస్‌ రికార్డింగ్‌ యాప్‌ ఏదైనా ఉంటే చాలు, వాట్సాప్‌ వాయిస్‌ కాల్‌ను రికార్డు చేసేయొచ్చు. అంటే వాట్సాప్‌లో ఇన్‌బిల్డ్‌ ఫీచర్‌ లేకున్నా.. థర్డ్‌ పార్టీ యాప్‌ను వాట్సాప్‌ అనుమతిస్తుందన్నమాట. అయితే ఆ టైంలో .. స్పీకర్‌ను తప్పనిసరిగా ఆన్‌ చేయాలి. లేకుంటే ఆ వాయిస్‌ రికార్డు అవ్వదు. ఆండ్రాయిడ్‌ ఫోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక రికార్డింగ్‌ యాప్‌ల ద్వారా వాట్సాప్‌ వీడియో కాల్స్‌ను సైతం రికార్డ్‌ చేయొచ్చు. అదే యాపిల్‌ ఫోన్లలో ఇలా రికార్డింగ్‌ చేయడం కుదరదు. కారణం.. థర్డ్‌ పార్టీ యాప్‌లను యాపిల్‌ అనుమతించకపోవడం, పైగా మైక్రోఫోన్‌ రికార్డింగ్‌కు తగ్గట్లు ఫీచర్‌ లేకపోవడం.   

క్యూబ్‌ కాల్‌
క్యూబ్‌ కాల్‌ అనేది ఫ్రీ రికార్డింగ్‌ యాప్‌. సిగ్నల్‌, స్కైప్‌, వైబర్‌, వాట్సాప్‌, హంగవుట్స్‌, ఫేస్‌బుక్‌, ఐఎంవో, వీచాట్‌.. ఇలా వేటి నుంచైనా వాయిస్‌ కాల్‌ రికార్డు చేయగలదు. ఈ యాప్‌ కొన్ని ఫోన్లలో ‘షేక్‌’(అటు ఇటు ఊపడం) ద్వారా పని చేస్తుంది కూడా.  ఒకవేళ ఈ యాప్స్‌ ఏవీ వద్దనుకుంటే.. ప్లేస్టోర్‌ నుంచి గూగుల్‌ రికార్డర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వాడుకోవచ్చు. క్యూబ్‌ కాల్‌, గూగుల్‌ రికార్డర్‌.. ఈ రెండూ ఫ్రీ యాప్స్‌. పైగా తేలికగా ఎవరైనా ఉపయోగించొచ్చు. ఇక యాపిల్‌ ఫోన్లలో ఇలా రికార్డు చేసే వీలు లేనప్పటికీ.. మాక్‌లో మాత్రం క్విక్‌టైం ద్వారా వాట్సాప్‌ వాయిస్‌ కాల్స్‌ను రికార్డు చేసే వీలుంది.

చదవండి: Google Photos- ఇలా చేయకుంటే మీ ఫొటోలు డిలీట్‌ అవుతాయి మరి!

మరిన్ని వార్తలు