ఆ ఫోన్లలో వాట్సప్ పని చేయదు

16 Dec, 2020 18:30 IST|Sakshi

కొన్ని పాత ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది సంస్థ. 2021లో కొన్ని మొబైల్స్ లలో వాట్సాప్ పని చేయదని తెలిపింది. ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ మొబైల్స్ కూడా వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. 2021లో ఐఓఎస్ 9, ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్లతో పనిచేసే మొబైల్స్ లో 2021 నుండి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్స్ ని ఉపయోగించుకునేందుకు వినియోగదారులు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించాలని వాట్సాప్ పేర్కొంది. మీరు కనుక వాట్సాప్ సేవలు వాడుకోవాలంటే ఓఎస్ 9, ఆండ్రాయిడ్ 4.0.3 ఆపై లేటెస్ట్ వర్షన్స్ స్మార్ట్‌ఫోన్లు మాత్రమే వాడాలి. అంతకన్నా పాత వర్షన్స్ వాడితే మీ మొబైల్ లో వాట్సప్ యాప్ పనిచేయదు.(చదవండి: నాలుగు బ్యాంకులతో వాట్సాప్ ఒప్పందం)

    

మరిన్ని వార్తలు