ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్‌?

19 Apr, 2023 15:35 IST|Sakshi

సాక్షి,ముంబై: ఐటీ కంపెనీల్లో ఆన్‌బోర్డింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఫ్రెషర్స్‌కు  విప్రో మరో షాక్‌ ఇస్తోంది.  తాజా సమాచారం  ప్రకారం  దాదాపు 15 నెలలకు పైగా  ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్‌లకు మరో పరీక్ష విధించనుంది. ఇలాంటి  శిక్షణను ఇప్పటికే పూర్తి చేసినప్పటికీ, మరోసారి ప్రాజెక్ట్ రెడీనెస్ ప్రోగ్రామ్‌ (పీఆర్‌పీ) శిక్షణ అంటే.. ఈ సాకుతో కొంతమంది ఫ్రెషర్స్‌ను తొలగించేందుకేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  ఇప్పటికే వేతనాల్లో  సగం కోతం విధించిన తరువాత  కూడా ఆన్‌బోర్డింగ్ కష్టాలకు తెరపడటం లేదు.

(ఇదీ చదవండి: Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్)

ఈ ఏడాది ఫిబ్రవరిలో   ఫ్రెషర్ల వేతనాలను రూ.6.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.  
తాజా పరీక్షలో ఫ్రెషర్స్‌  కనీసం 60 శాతం ఓవరాల్ స్కోర్‌తో, పీఆర్‌పీ శిక్షణను ఉద్యోగులు క్లియర్ చేయకపోతే, వారు వెంటనే తొలగించబడతారని వారికి పంపిన సూచనలలో కంపెనీ పేర్కొన్నట్టు సమాచారం. అయితే దీనిపై విప్రో అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

మరోవైపు ఐటీ మేజర్ తీసుకుంటున్న చర్యలు అనైతికం, అన్యాయమని, ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా పేర్కొన్నారు. కంపెనీ పాలసీలో ఆకస్మిక మార్పులు ఉద్యోగుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయని వ్యాఖ్యానించారు. (ఈ బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌: ఏటీఎం ట్రాన్సాక్షన్‌ ఫెయిలైనా చార్జీలు!)

మరిన్ని వార్తలు