రికవరీ ఉన్నా... కష్టాలు కొనసాగుతున్నాయ్‌!

1 Apr, 2021 06:32 IST|Sakshi

భారత్‌ ఎకానమీపై ప్రపంచబ్యాంక్‌

2020–21లో వృద్ధి శ్రేణి 7.5 నుంచి 12.5 శాతంగా అంచనా  

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 కఠిన లాక్‌డౌన్‌ పరిస్థితుల నుంచి భారత్‌ ఎకానమీ గణనీయంగా కోలుకున్నప్పటికీ, కష్టాల నుంచి బయటపడిపోలేదని ప్రపంచబ్యాంక్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2021–22లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం నుంచి 12.5 శాతం శ్రేణిలోనే నమోదవుతుందని వాషింగ్టన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్‌ లెండర్‌ అంచనావేసింది. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వార్షిక ‘స్పింగ్‌’ సమావేశాలు త్వరలో జరగనున్న నేపథ్యంలో దక్షిణాసియా ఎకానమీలపై బహుళజాతి బ్యాంకింగ్‌ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2016–17లో 8.3 శాతం వృద్ధిని సాధించిన తర్వాత 2019–20లో భారత్‌ కేవలం 4 శాతం వృద్ధికి పరిమితమైంది.

మరిన్ని వార్తలు