లాంచ్ కు సిద్ధంగా 75 అంగుళాల షియోమీ స్మార్ట్ టీవీ

15 Apr, 2021 20:40 IST|Sakshi

స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో తన హవా కొనసాగిస్తున్న షియోమీ. ఇప్పుడు స్మార్ట్​టీవీ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తుంది. క్రమ క్రమంగా భారత టెలివిజన్​ మార్కెట్​ను కూడా సొంతం చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కె 75 పేరుతో అతిపెద్ద స్మార్ట్​ టీవీని భారత మార్కెట్​లో లాంఛ్​ చేయనున్నట్లు ప్రకటించింది. షియోమీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన స్మార్ట్​ టీవీల్లో కెల్లా ఇదే అతిపెద్ద స్మార్ట్ టీవీ కావడం విశేషం. అంతేకాక, షియోమీకి చెందిన అత్యంత ఖరీదైన టెలివిజన్ కూడా ఇదేనని తెలిపింది.

దీని ఫీచర్స్, స్పెసిఫికేషన్లు 2020 డిసెంబర్‌లో ఇదే సిరీస్‌లో విడుదలైన 55 అంగుళాల వేరియంట్‌తో సమానంగా ఉంటాయని పేర్కొంది. కాగా, ఈ కొత్త స్మార్ట్​టీవీ ఏప్రిల్ 23న జరిగే ఆన్‌లైన్ కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదే కార్యక్రమంలో ఎంఐ 11ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా లాంఛ్​ చేయనుంది. ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కె 75 అంగుళాల అతి పెద్ద స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఈ టీవీలో సినిమా చూసేటప్పుడు థియేటర్​లో చూస్తున్న అనుభూతిని ఇస్తుంది. ఈ టీవీ ధరను మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఇదే ఫీచర్లతో ఇతర కంపెనీల నుంచి విడుదలైన 75 అంగుళాల టీవీలు రూ.1,50,000 ధరల శ్రేణిలో లభిస్తుండగా.. దీని ధర లక్ష రూపాయలలోపే ఉండే అవకాశం ఉంది.

చదవండి: 

ఛార్జింగ్ అవసరంలేని ఎలక్ట్రిక్ కారు!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు