దర్శకుడిగా మారనున్న హీరో..

18 Nov, 2020 12:57 IST|Sakshi

సాక్షి,ముంబై: ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తుతం నటనకు స్వస్తి చెప్పినా.. త్వరలోనే దర్శకత్వంలోకి రాబోతున్నాడని ఒక ఇంటర్వ్యూలో అతని స్నేహితుడు అక్షయ్ ఒబెరాయ్ చెప్పారు. ఇమ్రాన్ 2008లో ‘జానే తు ... యా జానే నా’... చిత్రంతో మొదటిసారిగా హీరోగా నటించారు. అతని చివరి సినిమా ‘కట్టీ బట్టీ’ 2015లో విడుదలయ్యింది. ఇద్దరం కలిసి ఒకే దగ్గర యాక్టింగ్‌ నేర్చుకున్నామని అక్షయ్ తెలిపారు. గుర్గావ్, కలకండి వంటి చిత్రాల్లో అక్షయ్‌ నటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘బాలీవుడ్‌లో నా బెస్ట్ ఫ్రెండ్ ఇమ్రాన్ ఖాన్. నాకు ప్రాణ స్నేహితుడు.. నేను అతనికి తెల్లవారుజామున 4 గంటలకు  కాల్ చేయగలను. నేను,ఇమ్రాన్ దాదాపు 18 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం. మేము అంధేరి వెస్ట్‌లోని కిషోర్ యాక్టింగ్ స్కూల్‌లో కలిసి యాక్టింగ్‌ నేర్చుకున్నాము.’ అని తెలిపారు. (చదవండి: ప్రేమ విషయాన్ని దాచలేదు: హీరో కూతురు)

‘‘ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతానికి నటనను విడిచిపెట్టారు. నాకు తెలిసినంతవరకు తనలో మంచి రచయిత, దర్శకుడు ఉన్నారు. ఆయన ఎప్పుడు డైరెక్షన్‌ చేస్తారో నాకు తెలియదు. కానీ ఓ స్నేహితుడిగా నేను ఎటువంటి ఒత్తిడి చేయను. ఆయన అద్భుతమైన చిత్రం చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే సినిమాపై  అతనికీ చాలా అవగాహన ఉంది” అని అక్షయ్ ఒబెరాయ్ తెలిపారు. 

Read latest Celeb-talk News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు