తనని తాను కాల్చుకునేలోపే ఊహించని దారుణం... ఆ తర్వాత

10 Jun, 2022 16:57 IST|Sakshi

కోల్‌కతా: డిప్రెషన్‌కి గురైన ఓ పోలీస్‌ ఆత్మహత్య చేసుకుందామని తుపాకీని తనవైపుకి తిప్పుకునేలోపే ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. ఈ మేరకు కోల్‌కతాలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల సాయుధ బలగాలకు చెందిన ఒక కానిస్టేబుల్‌ అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

ఐతే తుడుప్ లెప్చా అనే కానిస్టేబుల్‌ ఒక గంట పాటు ఆ ప్రాంతంలో సంచరిస్తూ, అకస్మాత్తుగా కాల్పులు జరిపాడని, ఆ తర్వాత తుపాకీని తనవైపుకి తిప్పుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు కూడా సెల్ఫ్‌లోడింగ్ రైఫిల్ నుంచే ఈ కాల్పులు జరిగాయని వెల్లడించారు. పైగా లెప్చా కోల్‌కతా సాయుధ పోలీసుల 5వ బెటాలియన్‌కు చెందినవాడని, బంగ్లాదేశ్ హైకమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నడాని చెప్పారు

మొన్నటిదాక సెలవుల్లో ఉన్న ఆయన ఈ ఉదయమే విధుల్లోకి చేరాడని, పైగా డిప్రెషన్‌తో గత కొంతకాలంగా బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌, మరో ఇద్దరు మృతి చెందారని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

(చదవండి: కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి ముఖం పై నెత్తుటి గాయాలు...ఫోటోలు వైరల్‌)

>
మరిన్ని వార్తలు