బస్సులో నుంచుని వెళ్లడం ఇష్టం లేక...ఏం చేశాడంటే...

31 Aug, 2022 18:08 IST|Sakshi

రోజు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులందరికీ బైక్‌లు ఉండవు. కొంతమంది బస్సుల్లోనూ, క్యాబ్‌ల్లోనూ ఆఫీసులకు వెళ్తుంటారు. ఐతే గంటల తరబడి వెయిట్‌ చేసి బస్సులో వెళ్లటం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ మహానగరాల్లో ట్రాఫిక్‌ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే ఇబ్బంది పడ్డాడు. అందుకని ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా!...

వివరాల్లోకెళ్తే...చెన్నైలోని ఒక వ్యక్తికి ప్రతిరోజు బస్సులో వెళ్లడం ఇష్టం లేక ఏకంగా బైక్‌ని దొంగలించాడు. ఈ మేరకు దినేష్‌ అనే 40 ఏళ్ల వ్యక్తి ఆగస్టు 14న స్పెన్సర్‌ ప్లాజాలోని షాపు వద్ద ఉన్న పార్కంగ్‌ ప్రాంతంలో పార్క్‌ చేసి షాప్‌కి వెళ్లాడు. అంతే షాప్‌ నుంచి తిరిగి వచ్చేటప్పటికి దినేష్‌ బైక్‌ ఉండదు. దీంతో సదరు వ్యక్తి పార్కింగ్‌ ఏరియాలో పెట్టిన బైక్‌ని దొంగలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఏరియాలోని పలు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా సదరు వ్యక్తిని  నెరుకుండ్రం పార్థసారథిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సదరు నిందితుడిపై హత్యనేరం ఉందని, ఈ కేసు విషయమై రోజు సంతకం చేసేందుకు అన్నాసలై పరిధిలోని పోలీస్టేషన్‌కి వస్తుంటాడని తెలిపారు.

ఐతే నిందితుడు పార్థసారథికి ఈ కేసు విషయమై సంతకం కోసం నెరుకుండ్రం నుంచి అన్నాసలైకి ప్రతి రోజు బస్సులో  గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీంతో విసుగు చెందిన నిందితుడు బైక్‌ని ఎత్తుకోపోవాలని డిసైడ్‌ అయ్యి ఇలా చేశాడని పోలీసులు తెలిపారు.

(చదవండి: పెళ్లికి నిరాకరిస్తోందని యువతిపై దాడి...ఆ తర్వాత అతను)

మరిన్ని వార్తలు