తీవ్ర విషాదం: పెన్నానదిలో ఏడుగురు గల్లంతు

17 Dec, 2020 18:10 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ సంఘటన సిద్ధవటంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాధమిక దర్యాప్తు మేరకు.. తిరుపతి కోరగుంటకు చెందిన సోమశేఖర్‌, యశ్‌, జగదీశ్‌, సతీష్‌, చెన్ను, రాజేష్‌, తరుణ్‌ సిద్ధవటం పెన్నానది వద్దకు విహారయాత్రకు వచ్చారు. సరదాగా ఈత కొడదామని నదిలో దిగారు. దీంతో వారు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు