Maharashtra Family Death: మహారాష్ట్రలో విషాదం.. ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి

20 Jun, 2022 16:30 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ముంబైకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీ జిల్లాలోని మహైసల్‌ గ్రామంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఇంట్లోనే విగత జీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ముగ్గురి మృతదేహాలు ఒకచోట, ఆరుగురి మృతదేహాలు వేర్వేరు చోట్ల లభ్యమయ్యాయని సాంగ్లీ ఎస్పీ దీక్షిత్‌ గెడమ్‌ తెలిపారు. అయితే పోస్టుమార్టం అనంతరం 9 మంది మరణానికి సంబంధించికచ్చితమైన కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
చదవండి: సాంకేతిక లోపం.. కేబుల్‌ కారులో చిక్కుకున్న 11 మంది టూరిస్టులు

మరిన్ని వార్తలు