ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో మహిళ పై సీనియర్‌ ఉద్యోగి వేధింపులు

5 May, 2021 10:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అల్వాల్‌(హైదరాబాద్‌): పనిచేసే చోట ఉన్నత ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ పరుశురాం తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌లో నివసించే ఓ మహిళ(35) హకీంపేట్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఉద్యోగం చేస్తోంది.

కొన్ని రోజులుగా తన సీనియన్‌ ఉద్యోగి ఎస్‌.కె.శర్మ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, రక్షణ కల్పించాలని కోరుతూ ఎయిర్‌ఫోర్స్‌ ప్రధాన గేటువద్ద ధర్నా చేసింది. అనంతరం అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు