13 ఏళ్ల బాలుడిపై హిజ్రా వేషగాళ్ల దాష్టీకం

15 Jan, 2021 20:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని 13 ఏళ్ల బాలుడికి బలవంతగా శస్త్ర చికిత్స చేయించి, హిజ్రాగా మార్చారు నలుగురు హిజ్రా వేషగాళ్లు. ఆ బాలుడిపై గత కొన్ని సంవత్సరాలుగా లైంగిక దాడులకు పాల్పడుతూ, బంధించి చిత్రహింసలకు గురిచేశారు. స్థానిక మహిళా కమీషన్‌ తెలిపిన వివరాల మేరకు..హిజ్రాల వేశంలో ఉండే నలుగురు మృగాళ్లు.. మూడేళ్ల కిందట జరిగిన ఓ డ్యాన్స్‌ ఈవెంట్‌లో బాధిత బాలుడికి డ్యాన్స్‌ నేర్పిస్తామని ఆశ చూపించి, తమతో పాటు తీసుకెళ్లి బంధించారు. అప్పటి నుంచి బాలుడిపై లైంగిక దాడులకు పాల్పడుతూ, మాదకద్రవ్యాలకు బానిసను చేశారు. కొన్ని రోజుల తర్వాత బాలుడికి శస్త్ర చికిత్స చేయించి హిజ్రాగా మార్చారు. అంతేకాకుండా బాధితుడికి హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చి అవయవాలు మారేలా చేశారు. 

ఇంతటితో ఆగకుండా ఇతరులతో లైంగిక దాడులు చేయించడంతో పాటు ట్రాఫిక్‌ సిగ్నల్‌ల వద్ద భిక్షాటన చేయించేవారు. ఎవరైనా ప్రయాణికులు ఒంటరిగా కనిపిస్తే వారిపై దాడి చేసి దోచువాలని ఆదేశించేవారు. వారు చెప్పినట్లు చేయకపోతే తిండి కూడా పెట్టేవారు కాదు. నిందితులు మరో బాలుడిని ట్రాప్‌ చేసే పనిలో ఉండగా బాధితుడు వారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. నిందితులలో ఇ‍ద్దరిని అదుపులోని తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు