భార్యను 41 సార్లు స్క్రూడ్రైవర్‌తో పొడిచి.. దారుణ హత్య

16 Nov, 2023 09:18 IST|Sakshi

అంకారా: టర్కీలో దారుణం జరిగింది. హోటల్ గదిలో ఓ బ్రిటీష్ పర్యటకుడు తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. స్క్రూ డ్రైవర్‌తో 41 సార్లు పొడిచి చంపాడు.  ఇస్తాంబుల్ సమీపంలోని ఫాతిహ్ మెవ్‌లనాకపి జిల్లాలో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

హోటల్‌ గదిలో అరుపులు వినడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు తీసి చూడగా.. మహిళ మృతదేహం అతి కారాతకంగా పొడిచి ఉంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆమె భర్త గది నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 

నిందితున్ని ప్రశ్నించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్యను తనే స్క్రూ డ్రైవర్‌తో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే.. తనకు డ్రగ్స్ ఇచ్చినందుకు ఇలా చేశానని పోలీసులకు చెప్పాడు. కానీ గదిలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. నిందితుడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 14న బ్రిటన్‌కు చెందిన భార్యభర్త ఇస్తాంబుల్‌కు వచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.  

ఇదీ చదవండి: అంతరిక్షంలోకి స్నేక్ రోబో.. నాసా ఆవిష్కరణలో భారత మేధస్సు

మరిన్ని వార్తలు