తల్లిదండ్రులే కూతురిని చంపారంటూ పుకార్లు..

20 Aug, 2021 08:04 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేస్తున్న దంపతులు

సాక్షి, మల్యాల(కరీంనగర్‌): తమ కూతురు చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ భార్యాభర్తలు పోలీస్‌స్టేషన్‌ ఎదుట భైఠాయించిన సంఘటన మల్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మల్యాల మండలకేంద్రానికి చెందిన సంగ శ్రీనివాస్‌–మంజుల కుమార్తె తేజస్విని గతేడాది సెప్టెంబర్‌ 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా స్థానికుల సమాచారం మేరకు అప్పటి సీఐ కిశోర్‌ శవయాత్రను మధ్యలో నిలిపివేసి పోస్టుమార్టంకు తరలించారు.  

తల్లిదండ్రులే కూతురిని చంపారంటూ పుకార్లు పుట్టాయి. తమ కూతురు చావుకు తాము కారణం కాదని నిరూపించుకునేందుకు తేజస్విని మృతికి కారణాలు కనుగొనాలని పోలీసుల చుట్టూ తిరుగుతున్నామని శ్రీనివాస్‌ మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. తమ బంధువుల అబ్బాయి ప్రేమపేరుతో వంచించడంతోనే కూతురు మృతిచెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. సీఐ రమణమూర్తి బాధితులతో మాట్లాడి కేసు విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు