చిన్నారుల అక్ర‌మ ర‌వాణా..రెండు రోజులే క‌స్ట‌డీకి అనుమ‌తి

6 Aug, 2020 08:45 IST|Sakshi

సాక్షి, విశాఖప‌ట్నం : చిన్నారుల అక్ర‌మ రవాణా కేసులో ప్ర‌ధాన‌ నిందితురాలిగా ఉన్న  డాక్ట‌ర్ న‌మ్ర‌తను విచారించ‌డానికి మహారాణిపేట పోలీసులు మూడు రోజుల క‌స్ట‌డీ కోరారు. అయితే రెండు రోజులక‌స్ట‌డీకి మాత్ర‌మే కోర్టు అనుమ‌తించింది. ఈ మేర‌కు రెండ‌వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు అనుమ‌తితో నేటి నుంచి రెండు రోజుల‌పాటు డాక్ట‌ర్ న‌మ్ర‌త‌ను పోలీసులు విచారించ‌నున్నారు.  దీంతో చిన్నారుల అక్ర‌మ ర‌వాణాలో ప‌లు కీల‌క విష‌యాలు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు తెలిపారు. (అనారోగ్యంగా ఉందంటూ జైలులో హంగామా..)

ఆస్పత్రి ముసుగులో పసికందులతో వ్యాపారం సాగించిన యూనివర్సల్‌ సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ పచ్చిపాల నమ్రత ఎ 1 నిందితురాలిగా విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అక్రమాలపై పోలీసుల సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఆరుగురు పసిపిల్లలను విక్రయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.  చిన్నారుల అక్రమ రవాణాపై సెక్ష‌స్ 468,471తో స‌హా జువైనల్ జస్టిస్ యాక్ట్ 2005కింద ప‌లు కేసులను పోలీసులు న‌మోదు చేశారు. (‘సృష్టి’ తీగలాగితే.. ‘పద్మశ్రీ’ డొంక వెలుగులోకి... )

మరిన్ని వార్తలు